Viral Video: పఫర్ ఫిష్‌తో ఆడుకోవాలనుకున్నాడు.. కానీ చివరికి చుక్కలు చూపించిందిగా..

ABN , First Publish Date - 2022-09-09T03:10:53+05:30 IST

సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు రోజూ వేలల్లో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆకట్టుకుంటుంటాయి. పఫర్ ఫిష్‌లు చాలా ప్రమాదకరమైనవి అనే విషయం అందరికీ తెలిసిందే..

Viral Video: పఫర్ ఫిష్‌తో ఆడుకోవాలనుకున్నాడు.. కానీ చివరికి చుక్కలు చూపించిందిగా..

సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు రోజూ వేలల్లో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆకట్టుకుంటుంటాయి. పఫర్ ఫిష్‌లు చాలా ప్రమాదకరమైనవి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చేపలు అత్యంత విషపూరితమైనవి కావడంతో ఎంతో అనుభవం ఉన్న చెఫ్‌లు మాత్రమే వీటిని వండగలరు. ఈ విషయం పక్కన పెడితే..  ప్రస్తుతం పఫర్ ఫిష్‌కు (Pufferfish) సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చేపల వలలో పడ్డ  పఫర్ ఫిష్‌తో ఓ వ్యక్తి  ఆడుకోవాలని చూస్తాడు. చేతికి గ్లౌజులు ఉన్నాయి కదా అని టచ్ చేయాలని చూస్తాడు. చివరకు చేప అతడికి షాక్ ఇస్తుంది. 


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సముద్రం (sea)  మధ్యలో బోటుపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం వల వేయగా.. వాటితో పాటూ ఓ  పఫర్ ఫిష్‌ కూడా పడుతుంది. ఒళ్లంతా ముళ్లులతో ఉన్న ఆ చేపను ఓ యువకుడు ఆసక్తిగా గమనిస్తుంటాడు. చేతికి గ్లౌజులు వేసుకుని, టచ్ చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే ఉన్నట్టుండి చేపకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఒక్కసారిగా అతడిపై అటాక్ చేస్తుంది. ముళ్లులు గట్టిగా తాకడంతో వామ్మో.. అంటూ యువకుడు విలవిల్లాడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

Viral Video: సంతోషంగా గిఫ్ట్ బాక్సును తెరచిన యువతి.. చివరకు ఊహించని ఘటనతో దిమ్మతిరిగే షాక్..





Updated Date - 2022-09-09T03:10:53+05:30 IST