Viral Video: పంతం నీదా.. నాదా.. సై!.. అంటూ పోటీపడ్డ మనిషి, మేక.. చివరికి విజయం ఎవరిదంటే..

ABN , First Publish Date - 2022-07-17T02:39:42+05:30 IST

సోషల్ మీడియా(social media) అందుబాటులోకి వచ్చాక.. వినోదానికి కొదవే లేకుండా పోయింది. ప్రపంచంలోని వింతలు, విశేషాలన్నీ స్మార్ట్ ఫోన్‌(Smart phone)లోనే దర్శనమిస్తున్నాయి. ఈ...

Viral Video: పంతం నీదా.. నాదా.. సై!.. అంటూ పోటీపడ్డ మనిషి, మేక.. చివరికి విజయం ఎవరిదంటే..

సోషల్ మీడియా(social media) అందుబాటులోకి వచ్చాక.. వినోదానికి కొదవే లేకుండా పోయింది. ప్రపంచంలోని వింతలు, విశేషాలన్నీ స్మార్ట్ ఫోన్‌(Smart phone)లోనే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఏదోవిధంగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు.. వివిధ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి మేకతో తలపడ్డాడు. మేక తలకు తన తలను ఆనించి ఎవరి బలం ఏంటో చూడాలని టెస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను మేకపై పరీక్షించాలని అనుకున్నాడు. ఓ మేకల మంద వద్దకు వెళ్లి.. బలంగా ఉన్న మేకను ఎంచుకున్నాడు. ఓ బండరాయి పైనుంచి మేక, కింద నుంచి అతను పోటీకి సిద్ధమయ్యారు. మేక తలకు తన తలను ఆనించి వెనక్కు నెట్టాలని చూశాడు. చివరకు మేక ఏమాత్రం తగ్గకుండా ఆ వ్యక్తిని బలంగా వెనక్కు నెడుతుంది. మేకతో పోటీపడాలని ఎంతో ప్రయత్నించిన అతను.. చివరికి తన వల్ల కాదు.. అన్నట్లుగా చేతులెత్తేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ మేక కాస్త వెనక్కు వెళ్లి.. గట్టిగా ఢీకొట్టుంటే.. పరిస్థితి తారుమారు అయి ఉండేదంటూ కొందరు చమత్కరిస్తున్నారు.

66 కోట్ల రూపాయల Income Tax కట్టాలంటూ ఈ ఫొటోలోని వ్యక్తికి నోటీసులు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..





Updated Date - 2022-07-17T02:39:42+05:30 IST