డెలివరీ బాయ్ అంకితభావానికి సెల్యూట్ చేయాల్సిందే.. పార్సిల్ అందించడం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టి మరీ..

ABN , First Publish Date - 2022-09-17T02:28:37+05:30 IST

పార్సిళ్లను సరైన సమాయానికి చేర్చే విషయంలో డెలివరీ బాయ్‌ల కష్టాలు అన్నీఇన్నీ కావు. కొందరు ఎండా.. వానను లెక్కచేయకుండా ఆర్డర్లను సరైన సమయానికి డెలివరీ చేస్తుంటారు. ఈ..

డెలివరీ బాయ్ అంకితభావానికి సెల్యూట్ చేయాల్సిందే.. పార్సిల్ అందించడం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టి మరీ..

పార్సిళ్లను సరైన సమాయానికి చేర్చే విషయంలో డెలివరీ బాయ్‌ల కష్టాలు అన్నీఇన్నీ కావు. కొందరు ఎండా.. వానను లెక్కచేయకుండా ఆర్డర్లను సరైన సమయానికి డెలివరీ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కొందరు ప్రమాదాలకు గురవుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ డెలివరీ బాయ్ అంకితభావాన్ని చూసి నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఆర్డర్‌ను అందించడం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సాహసం చేశాడు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ... ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ రైల్వే స్టేషన్‌లో ఉన్న మహిళ కొన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంది. అయితే కాసేపటికే రైలు కదులుతుంది. Dunzo డెలివరీ బాయ్ కోసం ఎదురుచూస్తూ.. డోర్ వద్ద కంగారుగా ఎదురు చూస్తుంటుంది. అంతలో డెలివరీ బాయ్.. ఆర్డర్ పట్టుకుని ప్లాట్‌ఫామ్ పైకి వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుండడాన్ని గమనిస్తాడు. మహిళ అతన్ని చూడగానే.. త్వరగా వచ్చెయ్.. అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆ యువకుడు వేగంగా పరుగెత్తుకెళ్లి.. చివరికి ఆ ఆర్డర్‌ను మహిళకు అందిస్తాడు. పార్సిల్ అందుకోగానే ఆ మహిళ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డెలివరీ బాయ్‌ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇతడి అంకిభావానికి సెల్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పొరపాటున ఖాతాలోకి రూ.11 వేల కోట్లు.. కొద్ది గంటల్లోనే మాయం.. కానీ అతడు తెలివిగా చేసిన ఒక్క పనితో రూ.5 లక్షల లాభం..!





Updated Date - 2022-09-17T02:28:37+05:30 IST