Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..

ABN , First Publish Date - 2022-08-08T01:05:26+05:30 IST

కుక్కల పట్ల కొందరు అమితమైన ప్రేమ పెంచుకుంటారు. వాటి సంరక్షణ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఇక వాటికి ఆపద వచ్చిందంటే తట్టుకోలేరు. కొందరైతే కుక్కల ప్రాణాలు..

Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..

కుక్కల పట్ల కొందరు అమితమైన ప్రేమ పెంచుకుంటారు. వాటి సంరక్షణ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఇక వాటికి ఆపద వచ్చిందంటే తట్టుకోలేరు. కొందరైతే కుక్కల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను కూడా ఫణంగా పెడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కొందరు పిల్లలు తమ పెంపుడు కుక్కను కాపాడేందుకు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొండచిలువతో పోరాటం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పార్కులోకి వచ్చిన కొండచిలువ.. కుక్కను పట్టుకుంటుంది. దాని నడుము చుట్టూ పెనవేసుకుని ఊపిరాడకుండా చేస్తుంది. కొండచిలువ నుంచి విడిపించుకునేందుకు.. కుక్క శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కాకపోవడంతో మొరుగుతూ తన బాధను వ్యక్తం చేస్తుంది. అక్కడే ఉన్న కొందరు పిల్లలు గమనిస్తారు. వెంటనే అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుక్కను విడిపించే ప్రయత్నం చేస్తారు. మొదట సాధ్యం కాకపోయినా.. తర్వాత చాలా నేర్పుగా కొండచిలువ తలను గట్టిగా పట్టుకుంటారు. మరికొందరు బాలులు కొండచిలువ తోకను పట్టుకుని పక్కకు లాగుతారు. ఎట్టకేలకు కుక్క క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Instagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..





Updated Date - 2022-08-08T01:05:26+05:30 IST