Viral Video: ఈ బుడ్డోడికి వర్షం అంటే ఎంత ఇష్టమో.. వానలో తడుస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2022-06-16T23:29:10+05:30 IST

చిన్న నాటి రోజులు జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ప్రతి మనిషికీ బాల్యం అనేది ఒక వెలకట్టలేని, విలువైన దశ. తెలిసీతెలీని వయసులో, బుడిబుడి అడుగులు వేస్తూ.. చిన్న..

Viral Video: ఈ బుడ్డోడికి వర్షం అంటే ఎంత ఇష్టమో.. వానలో తడుస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..

చిన్న నాటి రోజులు జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ప్రతి మనిషికీ బాల్యం అనేది ఒక వెలకట్టలేని, విలువైన దశ. తెలిసీతెలీని వయసులో, బుడిబుడి అడుగులు వేస్తూ.. చిన్న పిల్లలు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి. ఆ వయసులోని పిల్లలు ప్రపంచాన్ని మర్చిపోయి.. ఆటల్లో మునిగిపోవడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో చిన్న పిల్లల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ బుడ్డోడు వర్షంలో తడుస్తూ.. ఆ వాతావరణాన్ని ఆస్వాదించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


నెదర్లాండ్స్‌కు చెందిన ఓ బాలుడు పసుపు రంగు రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో తడుస్తుంటాడు. ప్రపంచాన్ని మర్చిపోయి.. వర్షాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నేలపై పడుకుంటాడు. పక్కన బాలుడి కుటుంబ సభ్యులు ఉన్నారో, లేరో తెలీదు గానీ.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటిదాకా 23 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. పిల్లలు చేసే పనులను పెద్దలు పర్యవేక్షించాలని కొందరు సలహా ఇస్తుంటే.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ మూడేళ్ల బాలుడు టీవీలో తన అభిమాన డ్రమ్మర్‌ను అనుకరిస్తూ తన ముందు టేబుల్‌పై ఉన్న పాత్రలు, బాటిళ్లను వాయించడం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

 నాతోనే తమాషా.. వెకిలి చేష్టలు చేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా..





Updated Date - 2022-06-16T23:29:10+05:30 IST