Viral Video: ఈ కారు డ్రైవర్‌ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకొంటారు..

ABN , First Publish Date - 2022-09-26T03:00:16+05:30 IST

కొందరు డ్రైవర్లు వాహనాలు నడిపే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాలలో చూపించినట్లుగా వాహనాలను నడుపుతుంటారు. ఇంకొందరు డ్రైవర్లు తమ పని అనం అందరికీ..

Viral Video: ఈ కారు డ్రైవర్‌ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకొంటారు..

కొందరు డ్రైవర్లు వాహనాలు నడిపే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాలలో చూపించినట్లుగా వాహనాలను నడుపుతుంటారు. ఇంకొందరు డ్రైవర్లు తమ పని అనం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సాహసాలు చేస్తూ.. చివరకు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టం బావుండడం వల్ల సురక్షితంగా బయటపడుతుంటారు. ఇక వర్షాకాలంలో నదులు దాటే సమయంలో కొందరు వాహనదారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ డ్రైవర్.. కారు నడిపే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. వేగంగా ఉన్న నదీ ప్రవాహాన్ని దాటేందుకు సాధారణంగా ఎవరూ ప్రయత్నించరు. కానీ కారు డ్రైవర్ మాత్రం ఎలాగైనా దాటాలని చూశాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా.. నదిలోకి కారును దింపేస్తాడు. రాళ్లతో నిండిన ఆ నదిని మామూలుగా దాటాలన్నా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిలోకి ఏమాత్రం ఆలోచించకుండా కారును పోనిస్తాడు. దిగగానే ముందు కారు పక్కకు నెట్టబడుతుంది. ఎక్కడ కొట్టుకుపోతుందో అని అనుకునే లోపే.. చాకచక్యంగా దాన్ని నియత్రించాడు. చివరకు పడవ తరహాలో ఆ కారు చకచకా నదిని దాటేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి డ్రైవర్‌ని మేము ఎక్కడా చూడలేదంటూ కొందరు.. ఇది కారు కాదు పడవ.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..

కాపురాలను కూల్చుతున్న కొత్త ట్రెండ్.. గిఫ్టుల పేరుతో ఏమార్చి రహస్యాలను భార్యాభర్తలు ఎలా బయటపెట్టుకుంటున్నారంటే.. 





Updated Date - 2022-09-26T03:00:16+05:30 IST