భారీ సర్పాన్ని చూసిన రెండేళ్ల బాలుడు.. పరుగెత్తుకుంటూ వచ్చి తోకను పట్టేసుకున్నాడు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-10-07T00:53:43+05:30 IST

రెండేళ్ల పిల్లలు సాధారణంగా.. బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఓ బుడతడు మాత్రం తన కంటే ఎన్నో రెట్లు పొడవున్న భారీ సర్పంతో ఆటలాడుతున్నాడు. పామును చూసిన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి దాని తొకను అమాంతం పట్టేసుకున్నాడు. అనంతరం అది ముం

భారీ సర్పాన్ని చూసిన రెండేళ్ల బాలుడు.. పరుగెత్తుకుంటూ వచ్చి తోకను పట్టేసుకున్నాడు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల పిల్లలు సాధారణంగా.. బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఓ బుడతడు మాత్రం తన కంటే ఎన్నో రెట్లు పొడవున్న భారీ సర్పంతో ఆటలాడుతున్నాడు. పామును చూసిన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి దాని తొకను అమాంతం పట్టేసుకున్నాడు. అనంతరం అది ముందుకు వెళ్తుంటే.. దాన్ని పట్టుకుని వెనక్కిలాగుతూ కాసేపు కస్తీ పట్టాడు. ప్రస్తుతం ఆ చిన్నోడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల మ్యాట్ రైట్.. మొసళ్లను, పాములను పట్టడంతో దిట్ట. గత 20ఏళ్లుగా ఆయన ఎన్నో వేల పాములను, మొసళ్లను చాకచక్యంగా బంధించారు. తాజాగా మ్యాట్ రైట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 2ఏళ్ల కొడుకు బంజోకు కూడా పాములను, మొసళ్లను పట్టడంలో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగానే రెండు మీటర్ల మీటర్ల కొండ చిలువను.. తన కొడుకుతో పట్టించాలని భావించారు. ఈ క్రమంలోనే బంజో చూస్తుండగానే.. ఓ భారీ పైతాన్‌ను తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో వదిలాడు. దీంతో ఆ బుడ్డోడు పరుగెత్తుకుంటూ వచ్చి.. ఆ పాము తోకను పట్టుకున్నాడు. 



తండ్రి పక్కన ఉండి ప్రోత్సహిస్తుండటంతో ఆ చిన్నోడు మరింత రెచ్చిపోయాడు. ఆ పాము ముందుకు కదులుతుంటే.. దాన్ని రెండు చేతులతో వెనక్కిలాగుతూ హల్‌చల్ చేశాడు. కాగా.. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించిన మ్యాట్ రైట్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను కేవలం ఇన్‌స్ట్రాగ్రాంలోనే 3.7లక్షల మంది వీక్షించారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియోను చూసి స్పందిస్తున్న నెటిజనం.. ఆ బుడ్డోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతూ కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-10-07T00:53:43+05:30 IST