Chhattisgarh : కానిస్టేబు‌ల్‌కు రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు... ఆ తర్వాత ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-07-24T18:09:43+05:30 IST

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని నగరం రాయ్‌పూర్ (Raipur)లో ఓ ట్రాఫిక్

Chhattisgarh : కానిస్టేబు‌ల్‌కు రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు... ఆ తర్వాత ఏమైందంటే...

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని నగరం రాయ్‌పూర్ (Raipur)లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యంత నిజాయితీగా వ్యవహరించి, అందరి ప్రశంసలు పొందుతున్నారు. రోడ్డుపై ఆయనకు దొరికిన రూ.45 లక్షలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించి పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. 


అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుఖనందన్ రాథోడ్ (Sukhnandan Rathore) మీడియాతో మాట్లాడుతూ, ట్రాఫిక్ కానిస్టేబుల్ నీలాంబర్ సిన్హా (Nilamber Sinha) అత్యంత నిజాయితీగా వ్యవహరించారని చెప్పారు. నవ రాయ్‌పూర్‌లోని కయబంధ పోస్ట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఆయనకు మానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రోడ్డుపై ఓ బ్యాగు కనిపించిందన్నారు. దానిలో సుమారు రూ.45 లక్షలు ఉన్నట్లు గమనించారని తెలిపారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు ఆ బ్యాగును అప్పగించారని చెప్పారు. నీలాంబర్ నిజాయితీని మెచ్చుకుంటూ, ఆయనకు రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. 


ఈ నగదు ఎవరికి చెందినదో తెలుసుకునేందుకు సివిల్ లైన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 


Updated Date - 2022-07-24T18:09:43+05:30 IST