ఉడుత కల!

ABN , First Publish Date - 2022-07-06T08:53:55+05:30 IST

ఒక అడవిలో అన్ని జంతువులతో పాటే షైనా అనే ఉడత ఆడుతూ పాడుతూ హాయిగా ఉండేది. అయితే దానికి ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది.

ఉడుత కల!

క అడవిలో అన్ని జంతువులతో పాటే షైనా అనే ఉడత ఆడుతూ పాడుతూ హాయిగా ఉండేది. అయితే దానికి ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. అదే తన జీవిత కల. అడవిలోని ఆనందవనం అనే ప్రాంతంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని అడిగితే అడవి రాజైన ‘షేర్‌’ ‘అది మూర్ఖం పని. డబ్బులు వృథా’ అన్నాడు. దీంతో ఉడుత బాధపడింది. సరిగా ఆహారం తినలేదు. ఒక రోజు ఉదయాన్నే తన ఫ్రెండ్‌ గున్నఏనుగును కలిసింది. తన పేరు ఎగ్గీ. షైనీని చూస్తూనే ఏదో బాధపడుతోందని ఎగ్గీకి అర్థమైంది. బలవంతంగా అడిగితేకానీ నిజం చెప్పలేదు ఉడుత. ‘ఆ పిచ్చి కోతులు, జింకలు, కుందేళ్లు.. ఇలా ఎవరికి వాళ్లు అజ్ఞానంతో ఉన్నారు. జంతువులను ఎడ్యుకేట్‌ చేయాలి’ అన్నది షైనీ. దీంతో ‘ఎలాగైనా రాజుగారిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. నా దగ్గర ఐడియా ఉంద’ని ఉడుతతో చెప్పింది ఎగ్గీ. ఉదయం లేస్తూనే ఓ అరటి చెట్టుకింద ‘వియ్‌ నీడ్‌ లైబ్రరీ’ అనే బోర్డు తగిలించుకుని ఉడుత కూర్చుంది. ఏమీ తినటం లేదు. నిరాహారదీక్ష చేస్తోంది. ఆ బోర్డును చూసి జంతువులన్నీ అక్కడ మూగిపోయాయి. అదో ఉద్యమంగా రూపు దాల్చింది. ఈ విషయం రాజు షేర్‌ చెవిలో పడింది. పెద్దగా పట్టించుకోలేదు రాజుగారు. రోజుల పాటు ఉడుత అలానే కూర్చుందక్కడ. విధిలేక మంత్రిగారైన పాంగో పిగ్‌ను పిల్చుకుని అరటి చెట్టు దగ్గరకు రాజుగారు వచ్చారు. లైబ్రరీ ఆవశ్యకత అవసరమని జంతువులన్నీ ముక్తకంఠంతో అంటున్నాయి. చేసేదేమీ లేక.. ‘సరే మనం లైబ్రరీ ఏర్పాటు చేసుకుందాం’ అన్నాడు షేర్‌. అందరూ చప్పట్లు కొట్టారు. ‘మన అడవిలోని ప్రతి ఇంటి నుంచి ఒక పుస్తకం దానంగా రావాలి. అప్పుడే ఈ లైబ్రరీ నాది అని ఫీల్‌ అవుతారు.. మెజిస్టీగారూ’ అని ఎగ్గీ సెలవిచ్చింది. ‘అద్భుతమైన ఐడియా’ అని రాజుగారు మెచ్చుకున్నారు. షైనా పట్టుదల చూసి అన్ని జంతువులూ తనకు కంగ్రాట్స్‌ చెప్పాయి. కొద్ది రోజుల్లోనే ఆనందవనంలో లైబ్రరీ కట్టారు. ఎన్నో జంతువులు లైబ్రరీకి వచ్చి చదువుకుంటూ జ్ఞానం సంపాదించుకుంటున్నాయి. తన కల నెరవేరినందుకు షైనా ఆనందానికి అవధుల్లేవు. 

Updated Date - 2022-07-06T08:53:55+05:30 IST