Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral Video: మ్యాన్‌హోల్‌లోకి దూరిన పాము.. నవరత్న ఆయిల్‌ను వాడి బయటకు రప్పించారిలా..!

ఇంటర్నెట్ డెస్క్: నవరత్నా అయిల్‌ను ఎందుకు ఉపయోగాస్తారు అంటే.. హెడ్‌మసాజ్‌కు అని ఠక్కున చెప్పేస్తారు. కానీ దీనిని ఈ మధ్య పాములను పట్టడానికి కూడా ఉపయోగించేస్తున్నారు కొంత మంది. నవరత్నా అయిల్‌తో పాములను ఏంటి.. ఇది అసాధ్యం అని అనుకుంటున్నారా? హర్యానాలో చోటు చేసుకున్న ఓ ఘటన గురించి వింటే మీరు కూడా దీన్ని నిజంమని అంగీకరిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ వింతఘటనకు సంబంధించిన విషయంలోకి వెళితే.. 


హర్యానాలోని పతేహాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి మంగళవారం ఓ పాము దూరింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు హడావిడి చేయడంతో అదికాస్తా వేళ్లి.. బాత్‌రూంలోని పైప్‌లైన్‌లో దూరింది. ఈ క్రమంలో ఆ కుటంబ సభ్యులు వైల్డ్‌లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నవజోత్ ధిల్లాన్ అనే అధికారి తన టీంతో సహా అక్కడికి చేరుకున్నారు. అనంతరం పైపులో దూరిన పామును పట్టుకునేందకు మొదట అందులో కొన్ని నీళ్లు పోశారు. అనంతరం కొంచెం ఆయిల్‌ను పోశారు. ఆయిల్ పోసిన కొద్ది సేపటికే ఆ పాము పైపులోంచి బయటికొచ్చింది. దీంతో దాన్ని బంధించిన అధికారులు.. సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవజోత్ ధిల్లాన్.. ఆ పాముకు విషం ఉండదని వెల్లడించారు. అంతేకాకుండా పామును పట్టుకునేందకు తాను నవరత్న ఆయిల్‌ను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఆయిల్‌ వాసనకు పాము బయటకు వచ్చినట్లు చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీంశం అయింది. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement