ఊహించని ఘటనలు చోటు చేసుకున్న సమయంలో షాక్ అవడం మన వంతవుతుంటుంది. అడవుల్లో ఉండాల్సిన జంతువులను జనావాసాల్లో చూసినప్పుడు, ఆకాశం నుంచి వింత వింత వస్తువులు భూమి మీద పడ్డప్పుడు.. కూడా ఇలాగే అనిపిస్తుంటుంది. మలేషియాలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అతనికి ఎలాంటి జంతువులు, వస్తువులు తారసపడేదు గానీ.. ఊహించని ఘటన మాత్రం చోటు చేసుకుంది. టాయిలెట్లో కూర్చుని ఉండగా.. అనుకోకుండా వింత శబ్ధం వినిపించింది. ఏంటా అని తిరిగి చూసిన అతడికి మైండ్ బ్లాక్ అయింది..
మలేషియాకు చెందిన 28 ఏళ్ల సబ్రీ తజాలి ఇటీవల టాయిలెట్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుతూ ఉన్నాడు. గేమ్ మాయలో పడి సమయం కూడా మర్చిపోయాడు. ఈలోగా వెనుక వైపు నుంచి శబ్ధం వినిపించింది. దీంతో ఒక్కసారిగా గేమ్ నుంచి బయటికి వచ్చి, వెనక్కు తిరిగి చూస్తాడు. అక్కడ పెద్ద పాము మెలికలు తిరుగుతూ కనిపించడంతో షాక్ అవుతాడు. తేరుకోకముందే ఒక్కసారిగా పైకి లేచిన పాము.. సబ్రీ వెనుక వైపు భాగాన్ని గట్టిగా పట్టుకుంటుంది.
ఎలాగోలా దాన్ని లాగి పక్కన పడేసి అక్కడ నుంచి బయటికి పారిపోతాడు. అటునుంచి అటే ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించాడు. పరీక్షించిన వైద్యులు.. పాము విషపూరితం కాదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ వైద్య చికిత్స చేసి పంపించేశారు. ఈ ఘటనతో అప్పటి నుంచి రెండు వారాల పాటు మరుగుదొడ్డి లేకి వెళ్లలేదని సబ్రీ.. సోషల్ మీడియా ద్వారా అన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి