ఆలన లేని అమ్మఒడి

ABN , First Publish Date - 2021-07-31T04:27:57+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే గర్భి ణులకు, రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద నగదును జమ చేస్తుంది.

ఆలన లేని అమ్మఒడి
నారాయణపేట జిల్లా ఆసుపత్రి

- పథకం కింద లబ్ధిదారులకు అందని ప్రోత్సాహకాలు

- కేసీఆర్‌ కిట్‌తోనే సరి పెడుతున్న రాష్ట్ర సర్కారు

- ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నగదు కోసం ఎదురుచూపులు

- ఆరు నెలలకోసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్న నగదు

- లక్ష్యం నెరవేరక పథకం అభాసుపాలు


గద్వాల/వనపర్తి (ఆంధ్రజ్యోతి)/మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం)/నారాయణపేట క్రైం/బిజినేపల్లి, జూలై 30 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే గర్భి ణులకు, రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద నగదును జమ చేస్తుంది. ఆడ బిడ్డ జన్మిస్తే రూ.13 వేలు, మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలను నాలుగు వి డతల్లో చెల్లిస్తోంది. అయితే, కొంత కాలంగా ఈ పా రితోషికాల మంజూరుకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. ఆరు నెలలకోసారి మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జ మ చేస్తోంది. దీంతో పథకంపై లబ్ధిదారులకు నమ్మకం పోతోంది. అసలే కరోనా పీడకాలంలో ఉపాధి లేక అ ల్లాడుతుంటే.. వైద్యం, పౌష్టిక ఆహారం ఖర్చులు బాలిం తల కుటుంబా లకు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల కుటుంబాలకు అత్యంత సాంత్వ న చేకూర్చే ఈ పథకంలో పెండింగ్‌ డబ్బులను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి జూలై 30 వరకు మ హబూబ్‌నగర్‌ జిల్లాలో వేల మంది గర్భిణులు, బా లింతలు అమ్మఒడి ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నారు. పథకం కింద నాలుగు విడతలుగా ఇచ్చే ఈ ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉండటంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొదటి విడత ఏఎన్‌సీ చెకప్‌లకు సంబంధించి 1,898 మంది గ ర్భిణులు, కాన్పు అయిన వారు 2,432 మంది బాలింత లు, మూడున్నర నెలల టీకాలు అయిపోయిన వారు 1,865 మంది, తొమ్మిది నెలల టీకాలు అయిపోయిన వా రు 2,013 మంది ఉన్నారు. వీరందరికి డబ్బుల చెల్లింపు పెండింగ్‌లోనే ఉంది.

- వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 61,972 మందికి రూ.18,60,67,000 మొత్తం చెల్లించారు. మరో 16,972 మందికి దాదాపు రూ.4.75 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇం దులో ఏఎన్‌సీ చెక్‌అప్‌ల స్టేజీలో రూ.1.26 కోట్లు పెండింగ్‌లో ఉండగా, డెలివరీల స్టేజ్‌ లో రూ.1.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జీరో ఇమ్యూనైజేషన్‌ స్టేజీలో రూ.98 లక్షలు, ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌ స్టేజీలో రూ.1.28 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు కేసీఆర్‌ కిట్‌ కోసం 15,136 మంది అర్హత సాధించగా, 11,133 మందికి సుమారు రూ.20 కోట్ల మేర చెల్లింపులు చేశారు. మరో 4,003 మందికి రూ.5.60 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏఎన్‌సీ, జీరో, ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌ స్టేజీల్లో దాదాపు రూ.2 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

- ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో 950 లబ్ధిదారులకు కేసీఆర్‌ కిట్లను అందజేశారు. మొత్తం 289 సిజేరియన్‌, 743 సాధా రణ ప్రసవాలు జరిగాయి. అందులో జనవరిలో 59 సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగగా,  ఫిబ్రవరిలో 49, మార్చిలో 71, ఏప్రిల్‌లో 50, మేలో ఏడు, జూన్‌ 53, సాధారణ ప్ర సవాలు జనవరిలో 159, ఫిబ్రవరిలో 125, మార్చిలో 134, ఏప్రిల్‌లో 118, మేలో 79, జూన్‌ 128 జరిగాయి. అయితే, ప్రసవం అయిన బాలింతలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సమయంలోనే కేసీఆర్‌ కిట్‌ను అందించి, ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసి పంపిస్తున్నారు. ఇక్కడ కిట్ల కొరత లేకున్నా, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు మా త్రం బాలింతల ఖాతాల్లో జమ కావడం లేదు. మొత్తం 1,032 మంది లబ్ధిదారుల్లో 200 మందికి పారితోషికం డబ్బులు దాదాపు రూ.10 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 250 కిట్లు అందుబాటులో ఉన్నాయి.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ చివరి వరకు సాధారణ ప్రసవాలు 1,757, సిజేరియన్‌లు 1,099 అయినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గ ణాంకాలు చెబుతున్నాయి. అయితే మే 17న అమ్మబడి పథకం కింద జిల్లాకు రూ.82 లక్షలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పథకం లబ్ధిదారులకు రూ.1.84 కోట్ల బకాయి లు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - 2021-07-31T04:27:57+05:30 IST