Abn logo
Jan 27 2021 @ 01:33AM

నీటి గుంతలో పడి వివాహిత మృతి


పెనుకొండ రూరల్‌, జనవరి 26: మండలంలోని మునిమడుగులో సాయిలీల(35) అనే వివాహిత ప్రమాదశాత్తు కాలుజారి నీటి గుంతలోపడి మంగళవారం మృతిచెందింది. కియా పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ సతీ్‌షకుమార్‌ తెలిపిన వివరాల మేరకు మునిమడుగు గ్రామానికి చెందిన సాయిలీలను 15ఏళ్ల క్రితం పుట్టపర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దైవాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారం రోజుల క్రితం సాయిలీల కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం బట్టలు ఉతకడానికి గ్రామ సమీపంలోని కుంటవద్దకు వెళ్లింది. నీటి గుంత వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడిపోయి ఈత రాక మృతి చెందింది. సాయిలీల ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానంతో తండ్రి ఆంజనేయులు నీటి గుంతవద్దకు వెళ్లి చూడగా నీటిలోపడి విగతజీవిగా తేలాడుతుండటంతో తండ్రి బోరున విలపించాడు. స్థానికులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సతీ్‌షకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement