Abn logo
Apr 13 2021 @ 01:16AM

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మామిడికుదురు, ఏప్రిల్‌ 12: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొమరాడకు చెందిన భానుప్రకాష్‌(25) అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి దుర్గారావు వద్ద వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల9న కర్నూలు జిల్లా నుంచి పశువుల దాణా వేసుకుని వస్తుండగా ఏలూరు వద్ద ఎక్కువ బరువు వేసుకుని వస్తున్నాడని ఆర్టీవో రూ.30వేలు జరిమానా విధించారు. దీనిపై వ్యాన్‌ యజమాని భానుప్రకాష్‌ మోటారుసైకిల్‌ను తన వద్ద ఉంచుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించి తీసుకువెళ్లాలని, అంతేకాకుండా ఫోన్‌లో దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన భానుప్రకాష్‌ ఇంటికి వచ్చి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్‌ రికార్డు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నగరం ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు తెలిపారు. అమలాపురం డీఎస్పీ వై.మాధ వరెడ్డి సోమవారం సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేశారు. ఆయనతో పాటు రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి ఉన్నారు. 


Advertisement
Advertisement
Advertisement