విద్యార్థులకు పిచ్చిమొక్కల స్వాగతం

ABN , First Publish Date - 2022-07-06T04:34:35+05:30 IST

స్థానిక గురుకుల పాఠ శాల విద్యార్థులకు కొత్త విద్యాసంవత్సరంలో పిచ్చిమొక్కలు స్వాగతం పలికాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థులకు పిచ్చిమొక్కల స్వాగతం
పిచ్చిమొక్కలతో నిండిపోయిన గురుకుల పాఠశాల - పాఠశాల ఆవరణలోనే గాలివానకు ఎరిగిపడిన చెట్ల కొమ్మలు

ఆందోళనలో గురుకుల పాఠశాల విద్యార్థులు 

పట్టించుకోని అధికారులు

రామాపురం, జూలై5: స్థానిక గురుకుల పాఠ శాల విద్యార్థులకు కొత్త విద్యాసంవత్సరంలో పిచ్చిమొక్కలు స్వాగతం పలికాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠ శాలల పునః ప్రారంభానికి వారం ముందే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా ఫలితం శూన్యమనే చెప్పాలి. 

 మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పిచ్చిమొక్కల తో నిండిపోయింది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాఠశాలలు శెలవులు ఇచ్చిన తర్వాత కురిసిన వానలకు, గాలికి చెట్లు విరి గి పాఠశాల ఆవరణలో కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. కరెంటు తీగలు రోడ్డుపై పడి పాఠశాలకు విద్యుత్‌  సరఫరా కూడా లేదు. పాఠశాలల పునః ప్రారంభంతో పాఠశాలకు  విద్యార్థులు ఎవరూ హాజరుకాలేదు. పాఠశా ల ఆవరణ కంపచెట్లతో నిండిపోయింది.

పాఠశాలలో పరిశుభ్రత అనేది ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై అధికారులు గానీ, ప్రతినిధులు గానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో చదవడానికి నిరాకరిస్తున్నారు. మొత్తం 500 మందికి పైగా విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఇక్కడ చదువుతున్నా రు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో పదే ళ్లగా కొత్త భనాలు కట్టుతూనే ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

 ఈవిషయమై ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ వివరణ ఇస్తూ హౌస్‌కీపింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి చర్చించి పనులు చేస్తామన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అధికారు లకు విన్నవించామన్నారు. 

Updated Date - 2022-07-06T04:34:35+05:30 IST