భారీ వర్షానికి కూలిన మర్రి వృక్షం.

ABN , First Publish Date - 2020-04-26T09:41:19+05:30 IST

మహావిశాఖ 98వ వార్డులో శనివారం మధ్యాహ్నం సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి గోశాల కూడలి నుండి ప్రభుత్వ..

భారీ వర్షానికి కూలిన మర్రి వృక్షం.

సింహాచలం, ఏప్రిల్‌ 25: మహావిశాఖ 98వ వార్డులో శనివారం మధ్యాహ్నం సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి గోశాల కూడలి నుండి ప్రభుత్వ ఆసుపత్రి మధ్య మార్గంలో మెయిన్‌ రోడ్డులోని శతాబ్దానికి కంటే ఎక్కువ చరిత్ర కలిగిన భారీ మర్రిచెట్టు కుప్పకూలింది. దాంతో  విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదిక పనిచేసి చెట్టును యంత్రాల సహాయంతో తొలగించి ట్రాఫిక్‌కు ఎక్కువ సమయం అంతరాయం కలుగకుండా చేయగలగటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-04-26T09:41:19+05:30 IST