Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 16 Jun 2022 00:52:55 IST

Viral: ఈ 61 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే కాదు మరో బాంబు కూడా పేల్చింది..!

twitter-iconwatsapp-iconfb-icon
Viral: ఈ 61 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే కాదు మరో బాంబు కూడా పేల్చింది..!

ఒక స్త్రీ లేదా పురుషుడికి 60 ఏళ్ల వయసు దాటితే దాదాపుగా బాధ్యతలన్నీ పూర్తయి కొడుకులు, కూతుర్లు, మనవళ్లు, మనవరాళ్లతో శేష జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ.. ఈ Grandma అందుకు పూర్తి భిన్నం. 61 ఏళ్ల వయసులో 24 ఏళ్ల యువకుడిని పెళ్లాడి ఇప్పుడు సంతానం కోసం పరితపిస్తోంది. ఈ విషయం తెలిసిన వాళ్లకు ‘ఇదెక్కడి విడ్డూరం బాబోయ్’ అనిపించినా ఇది నిజం. టిక్‌టాక్‌ ద్వారా ఈ 37 ఏళ్ల ఏజ్ గ్యాప్ జంట తమ వైవాహిక బంధం గురించి బయటపెట్టారు. ఆమె పేరు చెరిల్. వయసు ప్రస్తుతం 61 సంవత్సరాలు. ఆ యువకుడి పేరు మెక్ కెయిన్. వయసు 24 సంవత్సరాలు. జార్జియాకు చెందిన మెక్ కెయిన్‌తో చెరిల్ అనే ఈ బామ్మ ప్రేమలో పడింది.

Viral: ఈ 61 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే కాదు మరో బాంబు కూడా పేల్చింది..!


మెక్ కెయిన్ తొలుత ఈమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడింది. మెక్ కెయిన్ ప్రేమను అంగీకరించింది. ప్రేమకు వయసుతో పనిలేదని ఎవరో చెప్పినట్టుగా వీళ్లిద్దరూ అలా ఇష్టపడి ప్రేమలో పడ్డారు. ఇంకేముంది.. ప్రేమలో పడ్డాక అన్ని ప్రేమ పక్షుల్లానే వీళ్లూ విహరించారు. ఇద్దరూ కలిసి సినిమాలకు, షాపింగ్‌కు, వెకేషన్స్‌కు వెళ్లారు. ఇలాంటి పోకడలను ప్రోత్సహించడంలో పాశ్చాత్య దేశాల్లోని చాలా మంది ముందుంటారు. వాళ్లిద్దరూ ఇష్టపడితే వయసుతో పనేముందని వాళ్లను సమర్థిస్తున్న వారి సంఖ్య ఇంటర్నెట్‌లో పెరిగిపోయింది. ఆ క్రేజే వీళ్ల టిక్‌టాక్ పేజ్‌కు 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లను తెచ్చిపెట్టింది. @kingqurannewpage అనే పేరుతో ఉన్న వీళ్ల టిక్‌టాక్ పేజ్‌లో ఈ జంట తమ ప్రేమ గురించి బయటపెట్టింది. గత జూలైలో తన ఆన్‌లైన్ ఫ్యాన్స్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా పంపిన డబ్బుతో రింగ్ కొని చెరిల్‌కు మెక్ కెయిన్ ప్రపోజ్ చేశాడు. అలా వీళ్ల నిశ్చితార్థం జరిగిపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు.

Viral: ఈ 61 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే కాదు మరో బాంబు కూడా పేల్చింది..!


టెన్నెసెలోని నదీ తీరంలో జరిగిన వీళ్ల మ్యారేజ్ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా 20 వేల మందికి పైగా వీక్షించి ఈ కొత్త జంటకు ‘విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని శుభాకాంక్షలు తెలిపారు. అలా పెళ్లితో ఒక్కటైన ఈ జంట ఇప్పుడు పిల్లల కోసం పరితపిస్తోంది. సరోగసీ ద్వారా గానీ, దత్తత తీసుకుని గానీ మమ్మీడాడీ అని పిలిపించుకోవాలని మెక్ కెయిన్, చెరిల్ తెగ ముచ్చటపడిపోతున్నారు. ప్రస్తుతం చెరిల్‌కు 17 మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంతానం కావాలని కోరుకోవడంపై చెరిల్ స్పందిస్తూ.. తన కుటుంబంలో చాలామంది తన నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపింది. ఇప్పటికే తన మనవరాళ్లు, మనవళ్లు మెక్ కెయిన్‌ను ‘‘Papaw’’ అని పిలుస్తున్నారని చెరిల్ సంతోషంగా చెప్పింది. చెరిల్‌కు ఇప్పటికే ఏడుగురు సంతానం. తన భర్త మెక్ కెయిన్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని.. అందుకే తన బిడ్డకు తల్లి కావాలని కోరుకుంటున్నట్లు ఈ 61 ఏళ్ల బామ్మ చెప్పింది. ఈ స్టోరీ మొత్తంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. మెక్ కెయిన్‌కు చెరిల్‌తో 2012 నుంచే పరిచయం ఉంది. అప్పుడు అతని వయసు 15 సంవత్సరాలు. చెరిల్ కొడుకు క్రిస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో మెక్ కెయిన్ పనిచేసేవాడు. అలా పరిచయం ఉంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వీళ్లిద్దరూ కలుసుకోలేదు. 2020 నవంబర్ 4న మళ్లీ చెరిల్, మెక్ కెయిన్ అనుకోకుండా కలుసుకున్నారు.


ఒక స్టోర్‌లో చెరిల్ క్యాషియర్‌గా పనిచేస్తుండగా ఆమెను మెక్ కెయిన్ చూశాడు. అలా ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. 2020 నుంచి ఈ 61 ఏళ్ల చెరిల్, 24 ఏళ్ల మెక్ కెయిన్ డేటింగ్‌లో ఉన్నారు. 2021 జూలైలో మెక్ కెయిన్ ప్రపోజ్ చేశాడు. అంతేకాదు.. టెన్నెస్‌కు ఈ ప్రేమ జంట చెప్పా చేయకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఇప్పుడంతా ఒప్పుకోవడంతో కలిసి ఉంటున్నారు. చెరిల్‌కు ఉన్న ఏడుగురు సంతానం 41 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు. 17 మంది మనవళ్లు, మనవరాళ్లు. వాళ్లంతా 2 నుంచి 17 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్లు. అదండీ సంగతి. ఈ జంటను హ్యాపీగా బతకండంటూ ప్రోత్సహిస్తున్న వారితో పాటు ట్రోల్ చేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. అయినా ఈ వయసులో ఇదేంపనంటూ ఈ బామ్మను కొందరు నెటిజన్లు తూర్పారబడుతున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతనికైనా బుద్ధి లేదని చీవాట్లు పెడుతున్నారు. వీళ్లిద్దరికీ బ్రేకప్ అయిందని, విడిపోబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ‘తను నా భార్య.. ఆ మృత్యువు మాత్రమే మమ్మల్ని విడదీయగలదు. అప్పటివరకూ మేం ఒకరినొకరు వీడి ఎక్కడికీ వెళ్లేది లేదు’ అని లిప్ లాక్ పెట్టి మరీ మెక్ కెయిన్ ఆ వార్తలను కొట్టిపారేశాడు. ఈ ట్రెండింగ్ కపుల్ ఇలాంటి రూమర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. పిల్లలే తమ నెక్ట్స్ టార్గెట్ అంటున్నారు. బహుశా ‘పుర్రెకో బుద్ది’ అంటే ఇదేనేమో.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.