మంచి కోతి-పొగరు కోతి

ABN , First Publish Date - 2022-07-30T09:17:09+05:30 IST

ఒక ఊరిలో ఊడల మర్రిమాను. ఆ మర్రిమాను దగ్గర ఒక దేవాలయం ఉండేది.

మంచి కోతి-పొగరు కోతి

క ఊరిలో ఊడల మర్రిమాను. ఆ మర్రిమాను దగ్గర ఒక దేవాలయం ఉండేది. భక్తులు తెచ్చిన ఆహారం తింటూ పక్షులు, కుక్కలు, పిల్లులు..  జీవిస్తుండేవి. అక్కడ రెండు కోతులు ఉండేవి. ఒకటి మంచి కోతి, మరొకటి పొగరు కోతి. ఇద్దరూ హాయిగా ఆడుకునేవి. దొరికిన అరటిపండ్లు తినేవి. ఒకరోజు మంచి కోతి రోడ్డు దాటుతుంటే కారుకింద పడి.. కాలు విరగ్గొట్టుకుంది. కుంటుతూ నడుస్తూ మర్రిమాను దగ్గరకు పోతే పొగరు కోతి పట్టించుకోనేలేదు. 


ఆ మర్రిమానుకు దగ్గరలోని మామిడి తోటలోకి మంచికోతి-పొగరుకోతి వెళ్లాయి. చెట్టు ఎక్కలేకపోయింది మంచి కోతి. పొగరుకోతి గబగబా చెట్టు ఎక్కి మామిడి పండ్లు తిన్నది. నాకో మామిడి పండు ఇస్తావా.. అని మంచి కోతి అడిగింది. మామిడి పండు ఇవ్వకపోగా ఆ టెంకతో మంచి కోతిని కొట్టింది. ‘కాలు సరిగాలేదని ఇంత చిన్నచూపా’ అంటూ ఏడుస్తూ మంచికోతి కుంటుతూ ఇంటి దారి పట్టింది. పొగరు కోతి పట్టించుకోనేలేదు. మంచికోతి దారింటా వెళ్తుంటే.. ఒక రాయి కనపడింది. ఆ రాయిని పక్కకు తోస్తూనే బంగారం కనిపించింది. దాన్ని తీసుకుని కొంత దూరం వెళ్తూనే.. కుంట కనపడింది. ఆ కుంట దగ్గర ఓ ఎద్దుల బండి కనిపించింది. ఆ బండి మీద మంచి కోతి దర్జాగా ఇంటికి బయల్దేరింది. ఇంకొంచెం ముందుకు పోతూనే మామిడిబుట్టలు కనిపించాయి. కావాల్సినన్ని తీసుకుని నవ్వుతూ ఇంటికి వచ్చింది మంచి కోతి. రాత్రి సమయానికి పొగరుకోతి ఇంటికి వచ్చింది. మంచి కోతి తనకు దక్కిన అదృష్టాన్నంతా తన స్నేహితుడితో చెప్పింది. తనకూ అలాంటి అదృష్టం దక్కుతుందని భ్రమపడింది పొగరుకోతి. పరిగెత్తుకెళ్లి రాయిని ఎత్తింది. రాయికింద నుంచి వచ్చి తేలు కుట్టింది. గుట్ట దగ్గరకు పోయింది.. అక్కడ తోడేలు వెంటపడింది. కుంట దగ్గరకు వచ్చింది. అందులో నీళ్లు తాగాలని వెళ్లింది. అక్కడ బురదకుంటలోని మొసలి నోటికి పొగరు కోతి దొరికింది. 

Updated Date - 2022-07-30T09:17:09+05:30 IST