షాకింగ్ ఘటన.. కూతురి మృతదేహాన్ని ఉప్పుతో పూడ్చేసిన తండ్రి.. 44 రోజుల తర్వాత బయటకు తవ్వి తీసి..

ABN , First Publish Date - 2022-09-16T22:29:51+05:30 IST

కొన్ని కేసులు పోలీసులకు తలనొప్పిగా మారుతుంటాయి. మరికొన్ని కేసులను కొందరు పోలీసులు కావాలనే తారుమారు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటుచేసుకుంటూనే..

షాకింగ్ ఘటన.. కూతురి మృతదేహాన్ని ఉప్పుతో పూడ్చేసిన తండ్రి.. 44 రోజుల తర్వాత బయటకు తవ్వి తీసి..

కొన్ని కేసులు పోలీసులకు తలనొప్పిగా మారుతుంటాయి. మరికొన్ని కేసులను కొందరు పోలీసులు కావాలనే తారుమారు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాగే జరిగింది. తమ కూతురును కొందరు యువకులు చంపేశారని తల్లిదండ్రులు అంటుంటే.. పోలీసులు మాత్రం ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. దీంతో అసలు విషయం తేల్చుకోవాలనే ఉద్దేశంతో తండ్రి తన కూతురు మృతదేహాన్ని ఉప్పుతో కలిపి పూడ్చిపెట్టాడు. ఎట్టకేలకు 44 రోజుల తర్వాత బయటకు మళ్లీ బయటకు తీశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..


బాధితులు, పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్ర (Maharashtra) నందుర్‌బార్‌ పరిధి ధడ్‌గావ్ తాలూకాలోని ఖడక్యా గ్రామానికి చెందిన యువతి.. తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇదిలావుండగా, ఆగస్టు 1న గ్రామానికి చెందిన రంజిత్ ఠాక్రే, మరో వ్యక్తి కలిసి.. యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. ఈ క్రమంలో యువతి తన తండ్రికి ఫోన్ చేసి విషయం తెలియజేసింది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన యువకులు.. బలాత్కారం చేశారు. అనంతరం ఆమె తిరస్కరించడంతో హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చివరికి ఉరికి వేలాడదీశారు. కాసేపటి తర్వాత యువతి తండ్రికి ఫోన్ వచ్చింది. ‘‘మీ కూతురు ఉరి వేసుకుని చనిపోయింది’’.. అని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో కంగారుగా అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు.. కూతురిని విగతజీవిగా చూసి బోరున విలపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఓ మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్.. దుస్తుల్లో డాక్టర్‌కు ఓ లేఖ కనిపించడంతో..  


అయితే చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. తన కూతురు హత్యకు గురైందని.. మృతురాలి తండ్రి చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఎలాగైనా అసలు నిజం బయటికి రావాలనే ఉద్దేశంతో యువతి తల్లిదండ్రులు.. మృతదేహం కుళ్లిపోకుండా ఉండేందుకు, గోతి నిండా ఉప్పు వేసి పూడ్చిపెట్టారు. ఇటీవల తమ కూతురు మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం (Re Postmortem) నిర్వహించాలని కోరుతూ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ విషయం మీడియాలో రావడంతో చివరకు పోలీసులు స్పందించారు. సెప్టెంబర్ 14న పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి, ముంబైలోని జేజే ఆస్పత్రికి (Mumbai JJ Hospital) తరలించారు. శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులైన.. రంజిత్ ఠాక్రే, సునీల్ అలియాస్ హనా వాల్వి, అమర్ అలియాస్ గోతు వల్వి అనే యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

పిల్లలను స్కూలుకు పంపించి వచ్చే లోపే.. భార్యను ప్రియుడే చంపేశాడంటూ ఏడుస్తూ చెప్పిన భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!



Updated Date - 2022-09-16T22:29:51+05:30 IST