మోత్కూరులో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నాయకులు
మోత్కూరు, మే 19: మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయా లని యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు మందుల సురేష్ కోరారు. ఈ మేరకు ఇంటర్ విద్యార్థులు గురువారం మోత్కూరులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు మండలాల నుంచి సుమారు 1200మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాశారన్నారు. 60కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేనందున పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మోత్కూరు పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు శ్రీను, భోనగిరి సతీష్, శేఖరాచారి, హరీష్, సాయి, నాని, మహేష్ తదితరులు పాల్గొన్నారు.