అంకితభావంతో పనిచేసేవాడే నిజమైన దేశభక్తుడు

ABN , First Publish Date - 2022-08-20T06:10:21+05:30 IST

అంకిత భావంతో పనిచేసేవాడే నిజమైన దేశభక్తుడని యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఎన్‌.ఈశ్వరరెడ్డి పేర్కొ న్నారు.

అంకితభావంతో పనిచేసేవాడే నిజమైన దేశభక్తుడు
పలమనేరు డిగ్రీకళాశాలలో సదస్సులో ప్రసంగిస్తున్న యోగివేమన వర్సిటీ ప్రొఫెసర్‌ ఈశ్వరరెడ్డి

పలమనేరు, ఆగస్టు 19: అంకిత భావంతో పనిచేసేవాడే నిజమైన దేశభక్తుడని యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఎన్‌.ఈశ్వరరెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో తెలుగుశాఖ అధ్వర్యంలో ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ సౌజన్యంతో స్వాతంత్య్ర సాధనలో తెలుగు సాహిత్యం- కవుల పాత్ర అనే అంశంపై జరుగు తున్న రెండురోజుల జాతీయసదస్సు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ... నేడు దేశభక్తి అన్నది ఒక ప్ర శ్నార్థకమైందన్నారు. ఇక మనిషిని ద్వేషించేవాడు దేశభక్తుడు కాడని, కుల, మత, వర్గ, వర్ణ, అధి కారాలకు అతీతంగా ప్రవర్తించడమే నిజమైన దేశ భక్తి అని పేర్కొన్నారు. మనసా, వాచా అంకిభా వంతో పనిచేసేవాడే నిజమైన దేశభక్తుడని పేర్కొ న్నారు. ప్రతిఒక్కరూ తనను తాను రక్షించుకొంటూ కుటుంబాన్ని దేశాన్ని కాపాడడమే దేశభక్తి అని భా వించాలన్నారు.  అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సి పాల్‌ విజయశేఖరం మాట్లాడుతూ... దేశభక్తిని అలవరచుకొని దేశాభివృద్దికి పాటుపడాలని, స్వ తంత్య్ర పోరాటంలో వీరులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.  గౌరవ అథితి గా విచ్చేసిన ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల ఆ చార్యుడు భీమన్న మాట్లాడుతూ స్వార్థ బుద్దిని వదిలి నిస్వార్థంగా ప్రవర్తించడమే దేశభక్తి అని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి, గొప్పభవిష్యత్తుని నిర్మిం చుకోవడమే దేశభక్తి అని పేర్కొన్నారు.  పీలేరు సంజయ్‌గాంధీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం అనుసంధానమై సేవలు చేయడమే దేశభక్తి అని పేర్కొన్నారు. బాషా, మతం, వర్గం, కుల, విచక్షణ లేని ప్రేమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. మనిషిని ప్రే మించాలంటే ప్రతిఒక్కరూ మనిషిగా మారినప్పుడే సాధ్యమవుతుందన్నారు. ఏ ఉద్యమమైనా స్వేచ్చా, స్వాతంత్య్రం కోసం పనిచేస్తుందని, ఆ ఉద్యమానికి సాహిత్యం ఒక ప్రేరకంగా ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైనా దేశం ఇంకా ఎంతో సాధించాలని ఆశించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మదనపల్లె డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం నాయకులు, ప్రజలు, కవులు ఎలా శ్రమించారో అవగాహన చేసుకొని, వారిని స్ఫూర్తిగా తీసుకొని, దేశభవిష్యత్తుకు  శ్రమించడమే  నిజమైన దేశభక్తి అవుతుందన్నారు. సదస్సు సం చాలకుడు వాసు ప్రసంగిస్తూ... సదస్సులో చ ర్చించిన అంశాలను ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకొని, నిజజీవితంలో దేశభక్తులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల భోదన, బోదనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T06:10:21+05:30 IST