అబ్బురపరుస్తున్న మూడేళ్ల బుడతడు!
ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST
మూడేళ్ల వయసున్న ఈ బుడతడు 37 రకాల జంతువులను గుర్తిస్తాడు. 18 రకాల పక్షులు, 24 రకాల పండ్ల పేర్లు గడగడా చెబుతాడు...
స్కూల్‌కు వెళ్లే వయస్సు కాదు. అయితేనేం ఇంట్లో మమ్మీ, డాడీ నేర్పించిన వాటిని గుక్కతిప్పుకోకుండా అప్పచెబుతూ తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు చెన్నైకి చెందిన సాయి శ్రవణ్.
మూడేళ్ల వయసున్న ఈ బుడతడు 37 రకాల జంతువులను గుర్తిస్తాడు. 18 రకాల పక్షులు, 24 రకాల పండ్ల పేర్లు గడగడా చెబుతాడు. అంతేకాదు 31 స్మారక కట్టడాలు, 38 మంది ప్రముఖ వ్యక్తులు, 12 రకాల సముద్ర జీవులు ఇలా ఒక్కటేమిటి ఏది అడిగినా చెబుతాడు.
21 రకాల వాహనాలను గుర్తిస్తాడు. 21 దేశాల జాతీయ చిహ్నాలు కూడా అడిగిందే తడవుగా చెప్పేస్తాడు. మన దేశంలోని రాష్ట్రాల రాజధానుల పేర్లు కొట్టిన పిండి.
ఈ చిన్నారి తన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ స్థానం సంపాదించాడు. మరి సాయి శ్రవణ్‌ను మనమూ అభినందిద్దాం!