డబ్బుల కోసం ఇద్దరు అధికారుల అడ్డదారి

ABN , First Publish Date - 2022-06-09T06:19:14+05:30 IST

చెన్నేకొత్తపల్లి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో ఆ నలుగురిదే హవా. వారి అవినీతి, అక్రమాలకు అడ్దూ అదుపు లేకుండా పోతోంది.

డబ్బుల కోసం ఇద్దరు అధికారుల అడ్డదారి

ఆ నలుగురు

వ్యవహారం నడిపిస్తున్న  ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు 

సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో భారీగా అక్రమాలు

భూ విస్తీర్ణాన్ని బట్టి ముడుపులు

ప్రభుత్వ, అసైన్డ భూములకూ ఓకే


చెన్నేకొత్తపల్లి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో ఆ నలుగురిదే హవా. వారి అవినీతి, అక్రమాలకు అడ్దూ అదుపు లేకుండా పోతోంది. రిజిసే్ట్రషన విషయంలో సక్రమమా, అక్రమమా అనే అంశంతో నిమిత్తం లేదు. అడిగినంత సొమ్ము ఇస్తే.. క్షణాల్లో పని చేసిపెడతారు. నిబంధనల ప్రకారం పని చేయాలని, డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే.. వారికి చుక్కలు చూపిస్తారు. నెలల తరబడి తిరిగినా వారి ఫైలు కదలదు. ఆ నలుగురిలో ఆమె.. అతను.. అధికారులు, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు. ప్రైవేటు వ్యక్తులు ఇద్దరూ అన్నదమ్ములు. నలుగురు ఏకమై.. వసూళ్లలో మునిగితేలుతున్నారు. చిన్నపని మొదలు.. భూముల రిజిసే్ట్రషన వరకు వేలకు వేలు గుంజుతున్నారు. ప్రభుత్వ భూములను రిజిసే్ట్రషన చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, పట్టించుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వీరి అక్రమార్జన రోజుకు రూ.2 లక్షలకు పైగా ఉంటుందంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల దాకా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 


చెన్నేకొత్తపల్లి :సీకే పల్లి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం పేరు చెప్పగానే స్థానికులకు ఆ ఇద్దరు అన్మదమ్ములు గుర్తుకు వస్తారు. ఆ కార్యాలయానికి, వారికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా.. ఆ ఇద్దరి ప్రమేయం లేకుండా అక్కడ ఒక్క పనీ జరగదు. ఉదయం కార్యాలయం తలుపులు తెరిచింది మొదలు.. సాయంత్రం మూసేవరకూ ఆ ఇద్దరి కనుసన్నల్లోనే పనులు జరుగుతాయని చెబుతారు. వచ్చిన ఫైళ్ల గురించి అక్కడ పనిచేసే అధికారులు వారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఉందంటే.. వారి హవా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏ పనికి ఎంత రేటో వారే నిర్ణయిస్తారు. వచ్చిన ముడుపులలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా వారే నిర్ణయిస్తారు. ప్రజలే కాదు కార్యాలయ ఉద్యోగులు కూడా వారికి ఎదురుచెప్పలేని పరిస్థితి. చిన్నపనికి నుంచి పెద్ద పని వరకు ఆ ఇద్దరే నడిపిస్తారు. వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన చేయించంలో వారిది అందెవేసిన చేయి. అలాంటి పనుల్లో అడిగినంత సొమ్ము ఇస్తారు. అందుకే వాటిపట్ల అత్యంత ఆసక్తి, శ్రద్ధ చూపుతారు. వివాదాల్లో ఉన్న భూములపై డీల్‌ కుదరగానే.. స్థానికంగా కాకుండా, మరో ప్రాంతంలో పెండింగ్‌ రిజిస్ట్రేషన చేయిస్తారు. పూర్తి సొమ్ము చేతికి అందిన తరువాత స్థానిక కార్యాలయంలో ఆ రిజిస్ట్రేషనలు ఓకే చేయిస్తారు. 


బ్రెయిన వాష్‌ చేసి.. దందా..

సీకే పల్లి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయ సిబ్బందిలో కొందరి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. పనులు నిమిత్తం వచ్చే వారి ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి మరీ బేరసారాలకు దిగుతున్నారు. ‘ఖర్చుతో కూడుకున్న పని’, ‘సమయం పడుతుంది’,  ‘ఈ పని జరగడం కష్టం’ అని వచ్చినవారికి మొదట బ్రెయిన వాష్‌ చేస్తున్నారు. దీంతో ఎలాగైనా పనిచేసిపెట్టాలని బాధితులు వారిని ప్రాధేయపడుతున్నారు. ఇదే అదనుగా బేరసారాలకు దిగుతున్నారు. ఎంత ‘ఖర్చు’ అవుతుందో చెప్పి దండుకుంటున్నారు. ఎకరాల ప్రకారం అయితే మరో లెక్కన, సెంటు ప్రకారం ఒక లెక్కన ధర కడుతున్నారు. సెంటుకు రూ.3వేల నుంచి రూ.4 వేలు, ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అసైన్డ భూములను సైతం రిజిసే్ట్రషన చేసి, పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుం టున్నట్లు సమాచారం.


అంతులేని అవినీతి..

ఆ కార్యాలయంలో ఆ ఇద్దరు అధికారుల పేరు వింటే జనం హడలెత్తిపోతున్నారు. ఏ చిన్న పనికోసం వెళ్లినా.. ఏమిస్తావ్‌? ఎంతిస్తావ్‌? అని ముఖం మీదే అడుగుతున్నారు. ఇంత నేరుగా లంచం అడుగుతుండటంతో వెళ్లినవారు బిత్తరపోతున్నారు. పనుల కోసం కార్యాలయంలోకి అడుగుపెట్టగానే బేరసారాలు చేసుకోవాల్సిందే. వచ్చిన పని తెలుసుకోవడం, రేటు మాట్లాడుకోవడం.. ఓకే అనగానే కొన్నిగంటల్లోనే పని చేసిపెట్టడం.. ఇదీ అక్కడ జరిగే తంతు. అక్రమార్జనలో ఆ ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నారు.  ఒకరికి తెలియకుండా ఒకరు పనుల కోసం వచ్చిన వారికి వల విసురుతున్నారు. ఆమె అయితే.. మరింత దూకుడుగా అక్రమాలకు పాల్పడతారని సమాచారం.  ఇతర ప్రాంతాల వారితో పనిబడితే.. ఆ ప్రాంతానికి చెందిన సబ్‌ రిజిసా్ట్రర్‌తో నేరుగా సంప్రదింపులు జరిపి.. అవినీతి తతంగాన్ని నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ళ క్రితం రికార్డులను టాంపరింగ్‌ చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సస్పెండ్‌ అయ్యారు. కానీ తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, మళ్లీ సీకే పల్లి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయానికే రావడం గమనార్హం. 


దేనికైనా రెడీ..

భూముల రిజిస్ట్రేషన విషయంలో ఏ నిబంధనలూ అమలు కావడం లేదు. పూర్వం పట్టా, వంక పోరంబోకు, అసైన్డ భూములు.. ఏవైనా సరే..! కాసులిస్తే రిజిస్ట్రేషన చేసేయడమే. కార్యాలయ పరిధిలోని వివిధ ప్రాంతాలలో అసైన్డ భూములకు రిజిస్ట్రేషన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చెన్నేకొత్తపల్లి ప్రాంతంలో నాలుగు ఎకరాల అసైన్డ భూమిని రిజిస్ట్రేషన చేసేందుకు  ఓ రైతు నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని సమాచారం. రామగిరి, కనగానపల్లి మండలం కలికివాండ్లపల్లి వద్ద 8 ఎకరాలు, ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద అసైన్డ భూముల రిజిస్ట్రేషన కోసం రూ.కోట్లు దండుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. భూముల రిజిస్ట్రేషన కోసం ఆ కార్యాలయానికి వెళ్లినవారు బెంబేలెత్తుతున్నారు. రిజిస్ట్రేషన ఫీజుకంటే ప్రభుత్వ ఫీజుకు మూడింతలు అదనంగా వసులు చేస్తున్నారని వాపోతున్నారు. 


విచారణకు ఆదేశించాం..

సీకే పల్లి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపైన విచారించాలని జిల్లా రిజిసా్ట్రర్‌కు సూచించాము. అక్రమాలు రుజువైతే బాఽధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

- మాధవి, డీఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ


Updated Date - 2022-06-09T06:19:14+05:30 IST