మూడు అధికార భాషలున్న దేశం!
ABN , First Publish Date - 2020-10-15T06:06:54+05:30 IST
ఎటు చూసినా తెల్లటి ఇసుక బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్ర జలాలు, పర్యాటకులతో అక్కడ సందడిగా ఉంటుంది. దక్షిణ పసిఫిక్ స్వర్గంగా పేరుగాంచిన ఫిజీ విశేషాలివి...
ఎటు చూసినా తెల్లటి ఇసుక బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్ర జలాలు, పర్యాటకులతో అక్కడ సందడిగా ఉంటుంది. దక్షిణ పసిఫిక్ స్వర్గంగా పేరుగాంచిన ఫిజీ విశేషాలివి.
- ఈ దేశంలో 330 దీవులున్నాయి. ఇందులో 110 దీవులు మాత్రమే నివాసానికి అనువైనవి.
- ఫిజీ దేశ జాతీయ జంతువు ఏంటో తెలుసా? బల్లి! ఇగ్వానా అని పిలిచే ఈ బల్లి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ఫిజీ దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది.
- ఈ దీవుల్లో నివసించే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువే. అక్కడి జనాభాలో 38 శాతం భారతీయులు ఉన్నారు. బ్రిటిష్ ఆధీనంలో ఉన్న సమయంలో అక్కడి కాలనీల్లో పనిచేసేందుకు భారతీయులను తీసుకెళ్లారు.
- ఈ దేశంలో మూడు అధికార భాషలున్నాయి. అవి ఇంగ్లీష్, హిందీ, ఇటౌకె. స్థానికులు ఇటౌకె భాషలో మాట్లాడతారు. ఫిజీ దేశ రాజధాని నగరం సువ.