ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-05-22T06:40:47+05:30 IST

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు కారకుడనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
పి.అప్పలనర్స

ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స  

పాడేరు, మే 21 (ఆంధ్రజ్యోతి): దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు కారకుడనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని పేర్కొంటూ, తన వాహనంలోనే అతడి మృతదేహాన్ని తీసుకువచ్చారని, కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలిందన్నారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయించారనే  కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని, మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అప్పలనర్స డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-05-22T06:40:47+05:30 IST