Abn logo
Apr 23 2021 @ 22:57PM

మన్యంలో సందడిగా ఇటుకల పండుగ

చింతపల్లి, ఏప్రిల్‌ 23: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివాసీలు ఇటుకల పండుగను సందడిగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్‌, మేలో ఈ పండుగను వారం రోజులు జరుపుకుంటారు. ఆదివాసీ మహిళలు ప్రధాన రహదారి వద్ద గేట్‌ని ఏర్పాటుచేసి తాచేరు వసూలు చేస్తారు. పురుషులు అడవికి వెళ్లి జంతువులను వేటాడి తీసుకుని రావడం అనవాయితీ. అడవుల్లో జంతువులు అంతరించిపోవడంతో ప్రస్తుతం ఆదివాసీలు వేటకు వెళ్లడం మానేశారు. ప్రస్తుతం ప్రధాన రహదారి వద్ద ఏర్పాటుచేసిన గేట్‌లో  మహిళలు గిరిజన సంప్రదాయ నృత్య కళాప్రదర్శనలు ప్రదర్శిస్తూ తాచేరు (డబ్బు) వసూలు చేస్తున్నారు. శుక్రవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట ఆదివాసీలు తాచేరు వసూలు చేస్తూ కనిపించారు. 


Advertisement