‘మా అమ్మ చేసిన పెరుగు తినాలనుంది వెళ్లి తీసుకురండి’ అని భర్తను పంపిన భార్య.. తర్వాత ఆమె ఇచ్చిన షాక్‌కు అతడి మైండ్ బ్లాంక్

ABN , First Publish Date - 2022-06-25T14:29:21+05:30 IST

ఆ దంపతలిద్దరికీ ఈ మధ్యే పెళ్లైంది. ఇంతలో ఆ నవవధువు.. తన భర్తను తొలిసారిగా ఓ చిన్న కోరిక కోరింది. ‘నాకు మా చేసిన పెరుగు తినాలనుంది. వెళ్లి తీసుకుని రండి ప్లీజ్’ అని ప్రేమగా అడిగింది. దీంతో అతడు కరిగిపోయాడు

‘మా అమ్మ చేసిన పెరుగు తినాలనుంది వెళ్లి తీసుకురండి’ అని భర్తను పంపిన భార్య.. తర్వాత ఆమె ఇచ్చిన షాక్‌కు అతడి మైండ్ బ్లాంక్

ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతలిద్దరికీ ఈ మధ్యే పెళ్లైంది. ఇంతలో ఆ నవవధువు.. తన భర్తను తొలిసారిగా ఓ చిన్న కోరిక కోరింది. ‘నాకు మా అమ్మ చేసిన పెరుగు తినాలనుంది. వెళ్లి తీసుకుని రండి ప్లీజ్’ అని ప్రేమగా అడిగింది. దీంతో అతడు కరిగిపోయాడు. భార్య ఇష్టాన్ని కాదనలేక.. సరే అంటూ తలూపాడు. పెరుగు తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్లాడు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం.. తన భార్య చేసిన పని తెలిసి అతడి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వెంటనే అతడు పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని బెట్టయా ప్రాంతానికి చెందిన త్రిభువన్ కుమార్ అనే 22ఏళ్ల యువకుడికి షికార్పూర్ ప్రాంతానికి చెందిన అనితా కుమారి అనే యువతితో జూన్ 12 వివాహం జరిగింది. పెళ్లైన వారం రోజుల తర్వాత అనిత.. తన భర్తకు తొలిసారి తన ఇష్టాన్ని వ్యక్త పరిచింది. ‘మా అమ్మ చేసిన పెరుగు అంటే చాలా ఇష్టం. పెళ్లైన నాటి నుంచి దాన్ని మిస్ అవుతున్నా. మీరు వెళ్లి తీసుకురండి ప్లీజ్’ అని ప్రేమగా అడిగింది. దీంతో త్రిభువన్ కరిగిపోయాడు. వెంటనే అత్తారింటికి బయల్దేరాడు. పెరుగు తీసుకుని తిరిగి ఇంటికి బయల్దేరుతుండగా.. అత్తామామలు అతడిని అడ్డుకున్నారు. ‘మొదటిసారి ఇంటికి వచ్చారు.. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని.. మరుసటి రోజు ఉదయమే వెళ్లండి’ అని అడగడంతో అతడు కాదనలేకపోయాడు. ఈ క్రమంలో మరుసటి ఉదయం.. అనితా చేసిన పని తెలిసి షాకయ్యాడు. రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న సుమారు రూ.2లక్షల విలువైన నగలు.. డబ్బుతో అనిత తన ప్రియుడితో పారిపోయిందని ఫోన్ రావడంతో కంగుతిన్నాడు. దీంతో అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అనిత తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. తమ కూతురిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ కేసు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-06-25T14:29:21+05:30 IST