Advertisement
Advertisement
Abn logo
Advertisement

షాకింగ్.. రూ.15 కోట్ల విలువైన ఆస్తికి యజమాని కాబోతున్న కుక్క!

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్ (Ju Isen) తాజాగా కీలక ప్రకటన చేసింది. జు ఐసెన్ తీసుకున్న నిర్ణయంపట్ల.. ఆమె వ్యక్తిగత లాయర్లతోపాటు సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆమె చెప్పిన సమాధానంతో విని.. కంగుతిన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఆ నిర్ణయం ఏంటనే వివరాల్లోకి వెళితే.. 


జు ఐసెన్‌‌కు చిన్నప్పటి నుంచి మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే అవకాశాల కోసం సుమారు 2,19,000 పౌండ్లు (ఇండియన్ కరెన్సీలో రూ.1.64కోట్లు) వెచ్చించి.. దాదాపు 50 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. అనంతరం అవకాశాలు భారీగా రావడంతో కోట్లాది రూపాయాలను ఆర్జించింది. ఇదిలా ఉంటే.. ఆమెకు తన పెంపుడు కుక్క అంటే ప్రాణం. ఈ క్రమంలోనే కుక్కపై ప్రేమతో ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తన పేరున ఉన్న అపార్ట్‌మెంట్‌ను, లగ్జరీ కార్లను తన కుక్క పేరిట రాసియాలని నిర్ణయం తీసుకుంది. తన వ్యక్తిగత లాయర్లను కలిసి.. 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.15కోట్లు) విలువైన తన ఆస్తిని కుక్క పేరు మీదకు మార్చుతూ దస్త్రాలు తయారు చేయాలని సూచించింది. 


అది విన్న లాయర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం ‘అంత ఆస్తిని కుక్క పేరు మీద ఎందుకు రాస్తున్నావ్’ అంటూ జు ఐసెన్‌‌ను ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తనకు పిల్లలు లేనందు వల్లే కుక్క పేరిట ఆస్తిని రాయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తాను చనిపోయిన తర్వాత కూడా తన కుక్క లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయం బయటికి రావడంతో.. నెటిజన్లు ఆమె నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లలు లేరనే కంటే.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బిడ్డలను కనొచ్చు’ కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే నెటిజన్ల కామెంట్లకూ స్పందించిన ఆమె.. ‘పిల్లలు కనేందుకు టైం లేదు’ అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement