పోలీసులు, పిల్లలు... ఇద్దరిలోనూ ఆశ్చర్యకర స్థాయిలో కోవిడ్ యాంటీ బాడీస్!

ABN , First Publish Date - 2021-09-17T22:40:08+05:30 IST

శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్వహించిన ఓ అధ్యయనంలో, కోవిడ్‌ను నిరోధించే యాంటీ బాడీస్, అత్యధికంగా అక్కడి పోలీసుల్లో ఉన్నట్టు తేలింది. సాధారణ ప్రజల కంటే ఆశ్చర్యకర స్థాయిలోవారిలో యాంటీ బాడీస్ అధికంగా అభివృద్ధి చెందాయట.

పోలీసులు, పిల్లలు... ఇద్దరిలోనూ ఆశ్చర్యకర స్థాయిలో కోవిడ్ యాంటీ బాడీస్!

శ్రీనగర్ : శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్వహించిన ఓ అధ్యయనంలో, కోవిడ్‌ను నిరోధించే యాంటీ బాడీస్, అత్యధికంగా అక్కడి పోలీసుల్లో ఉన్నట్టు తేలింది. సాధారణ ప్రజల కంటే ఆశ్చర్యకర స్థాయిలోవారిలో యాంటీ బాడీస్ అధికంగా అభివృద్ధి చెందాయట.   


మొత్తం 10 జిల్లాల్లో సర్వే నిర్వహించగా 95 శాతం మంది పోలీసులు కరోనాకు వ్యతిరేకంగా స్పందించే యాంటీ బాడీస్ కలిగి ఉన్నట్టు గుర్తించారు. వారి తరువాతి స్థానంలో ఉన్న ఆరోగ్య రంగంలోని ఉద్యోగులు 91 శాతం యాంటీ బాడీస్‌ కలిగి ఉన్నారు. 


పోలీసులకి ఇప్పటికే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికావటం వల్ల వారిలో అత్యధిక యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయంటున్నారు డాక్టర్స్. అలాగే, జమ్మూ కాశ్మీర్లోని చిన్న పిల్లల్లోనూ 78 శాతం యాంటీ బాడీస్‌ని గమనించినట్టుగా వారు ప్రకటించారు. 7 ఏళ్ల నుంచీ 18 ఏళ్ల మధ్య వయస్సులోని పిల్లలకి అసలు వ్యాక్సినేషనే ప్రారంభం కాకున్నా ఇంతటి స్థాయిలో కరోనా నిరోధక శక్తి కనిపించటం ఆశ్చర్యకరమైన విషయమే. 


తాజా అధ్యయనం ఫలితాల్ని బట్టి చూస్తే కాశ్మీర్ ప్రభుత్వం త్వరలో విద్యాసంస్థల్ని పూర్తి స్థాయిలో తెరిచే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం యాంటీ బాడీస్‌తో అక్కడి పిల్లలు స్కూల్‌ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే మనం భావించాలి. అయితే, ఇప్పటికే 10, 12 తరగతుల విద్యార్థులు పాఠశాలలకి ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. 50 శాతం హాజరుతో మాత్రమే విద్యా సంస్థలు నడుస్తున్నాయి. 


Updated Date - 2021-09-17T22:40:08+05:30 IST