95 మంది బీజేపీ నాయకుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-28T10:44:55+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

95 మంది బీజేపీ నాయకుల అరెస్ట్‌

గద్వాలలో బీజేవైయం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్దం


గద్వాలక్రైం/గట్టు/ అక్టోబరు 27 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బండి సంజయ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో మంగళవారం ఉదయమే జిల్లా వ్యాప్తంగా 95 మంది బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయినా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. బీజేవైయం ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నాయకులను అరెస్ట్‌ చేయడం అమానుషమని, కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో బీజేవైయం, బీజేపీ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సంజీవ్‌భరద్వాజ్‌, ప్రవీణ్‌, మాల శ్రీనివాసులు, అప్సర్‌ పాష, అనీల్‌, హరిప్రసాద్‌,  రవికుమార్‌ ఎగ్బోటే తదితరులు ఉన్నారు.


 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న గట్టు మండల బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు మధుసూదన్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు బల్గెర శివారెడ్డి, బీజేపీ యువమొర్చా మండల అధ్యక్షుడు కొళాయి బాస్కర్‌, కార్యకర్తలు వెంకటేష్‌, జి.నాగప్ప, బెల్లం నర్సింహులు, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T10:44:55+05:30 IST