టీకాతో.. 94% తగ్గిన ముప్పు

ABN , First Publish Date - 2021-06-20T09:03:35+05:30 IST

కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా సోకినా.. ఐసీయూ చికిత్స అవసరం 6% మందికే వచ్చిందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. మిగతా 94% మందిని వైరస్‌ తీవ్రత నుంచి టీకా కాపాడిందని వివరించారు. రెండు డోసులు

టీకాతో.. 94% తగ్గిన ముప్పు

హెల్త్‌కేర్‌ వర్కర్లపై అధ్యయనం


న్యూఢిల్లీ, జూన్‌ 19: కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా సోకినా.. ఐసీయూ చికిత్స అవసరం 6% మందికే వచ్చిందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. మిగతా 94% మందిని వైరస్‌ తీవ్రత నుంచి టీకా కాపాడిందని వివరించారు. రెండు డోసులు టీకా తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లపై.. వెల్లూర్‌ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందన్నారు. రెండు డోసులు తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లలో కొవిడ్‌ సోకిన 8,991 మందిపై అధ్యయనం కొనసాగిందన్నారు. వీరందరిలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న ఒక్కరే చనిపోయారని చెప్పారు. 6% మందికి ఐసీయూ, 8% మందికి ఆక్సిజన్‌, 23% మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమైందని వివరించారు. సీఎంసీ అనే సంస్థ 7 వేల మంది హెల్త్‌కేర్‌ వర్కర్లపై నిర్వహించిన మరో సర్వేలో.. రెండో డోసు తర్వాత 1,350 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలిందన్నారు.

Updated Date - 2021-06-20T09:03:35+05:30 IST