జాతీయ లోక్‌అదాలత్‌లో 9,308 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-28T05:39:14+05:30 IST

ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కేసుత సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌అదాలత్‌ ఎంతగానో దోహదపడిందని ఎస్పీ మలికగర్గ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

జాతీయ లోక్‌అదాలత్‌లో 9,308 కేసులు పరిష్కారం
స్పందనలో ప్రజల సమస్యలు వింటున్న ఎస్పీ మలికగర్గ్‌

రాష్ట్రంలో జిల్లా  రెండో స్థానం  

పోలీసులకు  ఎస్పీ మలికగర్గ్‌ అభినందనలు  

ఒంగోలు(క్రైం), జూన్‌ 27: ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కేసుత సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌అదాలత్‌ ఎంతగానో దోహదపడిందని ఎస్పీ మలికగర్గ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసుల పరిష్కారం కోసం విశేషంగా కృషిచేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వివిధ కేసుల్లో కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి 7,277 కేసులు, పెండింగ్‌ ట్రయిల్‌ కింద ఉన్న 2,031 కేసులు మొత్తం 9,308 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు.


సత్వర న్యాయం కోసం స్పందన 

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు స్పందన కార్యక్రమం దోహదపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు.  సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ మందిరంలో జరిగిన స్పందనకు జిల్లా నలుమూలల నుంచి 73 ఫిర్యాదులు అందాయి. వీటిలో హౌసింగ్‌బోర్డులో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని టి.రాజేంద్రకుమార్‌ రూ.లక్ష తీసుకొని మోసం చేశాడని పొదిలికి చెందిన దర్శి సుబ్బారావు ఫిర్యాదుచేశారు. ఒంగోలు నేతాజీకాలనీలో ప్లాటు ఇప్పిస్తానని వెంకటేశ్వరనగర్‌కు చెందిన కోడూరి హరిబాబు రూ.50వేలు తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమంటే చంపేస్తానని బెదిరించాడని ఒంగోలుకు చెందిన డి.శ్యామల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై సత్యరమే స్పందించి పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ కె.నాగేశ్వరరావు, ఏఎస్పీ(క్రైమ్‌)శ్రీధరరావు, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు, ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు, సీఐ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:39:14+05:30 IST