ప్రాణదాన పథకానికి 90 మంది రోగుల ఎంపిక

ABN , First Publish Date - 2022-05-27T07:19:45+05:30 IST

టీటీడీ ప్రాణదాన పథకానికి 90 మంది రోగులను ఎంపిక చేశారు.

ప్రాణదాన పథకానికి 90 మంది రోగుల ఎంపిక
రోగుల వివరాలు తెలుసుకుంటున్న స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ

తిరుపతి సిటీ, మే 26: టీటీడీ ప్రాణదాన పథకానికి 90 మంది రోగులను ఎంపిక చేశారు. గురువారం స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ ఆధ్వర్యంలో ప్రాణదాన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. బియ్యం కార్డు కల్గిన ఆర్థిక స్థోమత లేని 90 మంది నిరుపేద రోగులను ఉచిత శస్త్ర చికిత్సలకు కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. విభాగాల వారీగా.. ఆంకాలజీకి 36 మంది, న్యూరోసర్జరీకి 16 మంది, మెడిసిన్‌కి నలుగురు, న్యూరాలజీకి ఎనిమిది మంది, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి 12 మంది, కార్డియోఽథొరాసిక్‌కి 10మంది, నెఫ్రాలజీకి నలుగురు ఉన్నారు.  ఈ పథకానికి దాతలు, సంస్థలు ముందుకొచ్చి చేయూతనిస్తే మరింత మంది రోగులకు ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుందని డాక్టర్‌ వెంగమ్మ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T07:19:45+05:30 IST