ఒక్క రోజే 9,718 కేసులు

ABN , First Publish Date - 2020-03-30T09:41:48+05:30 IST

జనతా కర్ఫూ (ఆదివారం 22/03/2020) నుంచి ఏడవ రోజు లాక్‌డౌన్‌ (ఆదివారం 29/03/2020) దాకా గడచిన వారం రోజులలో నగర జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

ఒక్క రోజే 9,718 కేసులు

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల కొరడా 

ప్రభుత్వ  సూచనలను పట్టించుకోని పౌరులు

ఇప్పటికీ అక్కడక్కడ రోడ్లపైకి జనం

లాక్‌డౌన్‌ కఠినతరం చేస్తున్న పోలీసులు

ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీలు


జనతా కర్ఫూ (ఆదివారం 22/03/2020) నుంచి ఏడవ రోజు లాక్‌డౌన్‌ (ఆదివారం 29/03/2020) దాకా గడచిన వారం రోజులలో నగర జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కొన్ని మినహాయింపులతో కూడిన లాక్‌డౌన్‌కు దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాలు అలవాటు పడ్డాయి. అయితే.. ఆదివారం కొన్ని మార్కెట్ల దగ్గర కనబడ్డ రద్దీ... ఇంకా సామాజికంగా మరిన్ని మార్పులు రావాల్సిన అవసరాన్ని సూచించింది.


లాక్‌డౌన్‌ మినహాయింపులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని భావించిన పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారు. ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తేనే కరోనాపై కదనంలో విజయం పొందగలమని సామాజిక శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అంతేకాక... పౌరుల అవసరాలకు తగ్గట్లు సరుకుల పంపిణీ జరిగితే.. దుకాణాలపైకి ఎగబడడం సహజంగానే తగ్గిపోతుందని కూడా సూచిస్తున్నారు. తొలి వారం నేర్పిన పాఠాలతో... నగరం లాక్‌డౌన్‌ ఎనిమిదో రోజులోకి అడుగుపెడుతోంది.


హైదరాబాద్‌ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) :


 లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా... బయటకు వస్తున్న వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి సీజ్‌ చేస్తున్నారు. నిబంధనలను పాటించని వాహనాలను కెమెరాల ద్వారా గుర్తించి ఆన్‌లైన్‌లో చలానాలు పంపిస్తున్నారు.  ఏఎన్‌పీఆర్‌ కెమెరాల ఆధారంగా పరిమితికి మించి కూర్చొని, 3 కిలోమీటర్ల పరిధి దాటి తిరుగుతున్న, పదేపదే బయటకు వస్తున్న వాహనాలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిపై చలానాలు పంపించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. అకారణంగా రోడ్డుపైకి వాహనంతో వచ్చినవారి వాహనాలపై కేసులు నమోదుచేసి సీజ్‌చేస్తున్నారు.


రోడ్లపై నమోదు చేసిన కేసులు


మార్చి 27 మార్చి 28 మార్చి 29

ద్విచక్రవాహనాలు 597 732 1508

ఆటోలు 71 41 72

కార్లు 48 53 126

భారీవాహనాలు 1


కెమెరాల ద్వారా నమోదైన కేసులు


మార్చి 27 మార్చి 28 మార్చి 29

ద్విచక్రవాహనాలు 9,742 9,648 7,814

ఆటోలు 58 27 55

కార్లు 455 395 122

భారీవాహనాలు 61 53 20


Updated Date - 2020-03-30T09:41:48+05:30 IST