80శాతం రాయితీతో వరి విత్తనాలు

ABN , First Publish Date - 2021-12-08T02:59:21+05:30 IST

ఇటీవల వర్షాలకు నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 80శాతం రాయితీతో వరి విత్తనాలను అందచేస్తున్నదని ఎమ్మెల్యే

80శాతం రాయితీతో వరి విత్తనాలు
: రైతులకు విత్తనాలను అందజేస్తున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు

గూడూరు, డిసెంబరు 7: ఇటీవల వర్షాలకు నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 80శాతం రాయితీతో వరి విత్తనాలను అందచేస్తున్నదని ఎమ్మెల్యే వరప్రసా ద్‌రావు అన్నారు.  మంగళవారం స్థానిక వెలుగు కార్యాల యంలో రైతులకు రాయితీపై వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో నష్టపోయిన పేదలకు ఇప్పటికే ప్రభుత్వం నిత్యావసర వస్తువులను అందచేసిందన్నారు. అనంతరం పొదుపు మహిళలకు పెరటికోళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఊటుకూరు యామిని, ఎంపీపీ గురవయ్య, మల్లు విజయకుమార్‌రెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, బత్తిని విజయ్‌ కుమార్‌, తహసీల్దారు లీలారాణి, ఎంపీడీవో నాగమణి, ఏడీ శివనాయక్‌, ఏవో నాగమోహన్‌రావు తదితరులు పాల్గొ న్నారు.


చిల్లకూరులో...


చిల్లకూరు, డిసెంబరు 7:  చిల్లకూరులోని క్రాంతిపధం కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు పొదుపు సంఘాల మహిళలకు పెరటికోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి 100 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. పెరటికోళ్ల కోసం రూ. 3,970 చెల్లిస్తే 8 పెట్టలు, 3 పుంజులు, మేత అందజే స్తారన్నారు.  అలాగే 80 శాతం రాయితీతో వరి విత్తనాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య, అన్నంరెడ్డి పరంధమరెడ్డి, దిలీప్‌రెడ్డి, అనుదీప్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏసీ మధుసూదన్‌రావు, ఏడీ శివనాయక్‌, ఏపీఎం నిర్మల  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T02:59:21+05:30 IST