పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 8 ఏళ్ల బాలుడు.. కుర్చీలో కూర్చుని ఏడుస్తూ తల్లి గురించి చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు..!

ABN , First Publish Date - 2022-09-15T21:12:35+05:30 IST

పిల్లాడు తన తల్లి మీద ఫిర్యాదు చేశాడు. ఆ పోలీసులు అతడి ఫిర్యాదు విని ఆశ్చర్యపోయారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 8 ఏళ్ల బాలుడు.. కుర్చీలో కూర్చుని ఏడుస్తూ తల్లి గురించి చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు..!


ఎనిమిదేళ్ళ పిల్లాడు ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఆ బాబు ఏడుపు చూసి ఏమయ్యిందోనని ఆ స్టేషన్ లో పోలీసులు కంగారు పడ్డారు, అయ్యో పాపం ఏమయ్యిందో పిల్లవాడికి అని దగ్గరకు పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి మెల్లిగా విషయం ఏమిటని అడిగారు పోలీసులు. ఆ పిల్లాడు తన తల్లి మీద ఫిర్యాదు చేశాడు. ఆ పోలీసులు అతడి ఫిర్యాదు విని ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి మాట్లాడుతున్నది అంతా వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే.....


బీహర్ రాష్ట్రం లో సీతామర్హి  ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కొడుకు 8 సంవత్సరాల శివమ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా అమ్మ నాకు అన్నం పెట్టడం లేదు, నేను ఎన్నిసార్లు అడిగినా నన్ను తిడుతోంది, కోప్పడుతోంది అని కంప్లైంట్ చేశాడు. ఆ మాట వినగానే పోలీసులకు జాలి కలిగి ఆ పిల్లాడికి భోజనం పెట్టించి తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే ఆ పిల్లాడి తల్లిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఎందుకు పిల్లాడికి భోజనం పెట్టలేదని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. 


ఆమె భర్త వారితో ఉండటం లేదు, వేరే రాష్ట్రానికి పనికోసం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. సీతామర్హి లో ఆ పిల్లాడు, వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటున్నారు. శివమ్ కుమార్ చాలా అల్లరివాడు, అతడు వాళ్ళ అమ్మ తినడానికి ఏమైనా ఇస్తే కొన్నిసార్లు పడేసాడు. దాంతో కోపం వచ్చి వాళ్ళమ్మ ఆ పిల్లాడికి ఆహారం విలువ తెలియాలని తిండి పెట్టకుండా అలా చేసింది. జరిగింది మొత్తం విన్న పోలీసులు కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళు ఆహారం వృథా అవుతుంటే చూస్తూ ఉండలేరు కదా అని అర్థం చేసుకున్నారు. శివమ్ వాళ్ళ అమ్మ చేసినదాంట్లో తప్పేమీ లేదని ఆమెను ఏమీ అనలేదు, అలాగే శివమ్ కుడా చిన్నపిల్లాడే కదా అని అతన్ని కూడా ఏమీ అనలేకపోయారు. కొద్దిసేపయ్యాక శివమ్ ను వాళ్ళమ్మ పిలుచుకుని వెళ్ళిపోయింది. ఆకలి తీరేసరికి శివమ్ కుడా వాళ్ళమ్మతో బుద్దిగా వెళ్ళాడు. ఇదంతా చూసిన నెటిజన్లు ఈ కాలం పిల్లలు మామూలోళ్ళు కాదని నవ్వుకున్నారు. 

Updated Date - 2022-09-15T21:12:35+05:30 IST