8 గంటల పని విధానాన్ని కొన సాగించాలి

ABN , First Publish Date - 2022-07-02T05:22:37+05:30 IST

పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాలను కొనసాగించాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది.

8 గంటల పని విధానాన్ని కొన సాగించాలి
ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఏఐటీయూసీ నేతలు

కడప(సెవెన్‌రోడ్స్‌), జూలై 1: పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాలను కొనసాగించాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు కడప ఆర్డీఓ కార్యాలయం దగ్గర కడప నగర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థల కోసం 12 గంటల పని దినంగా మార్చడం అత్యంత దుర్మార్గమని వారు కేంద్ర ప్రభు త్వంపై ధ్వజమెత్తారు. నాలుగు లేబర్‌ కోడ్లతో కార్మికులకు అదనపు పని భారం, సంక్షేమ పథకాలు, పీఎఫ్‌ వంటివి తగ్గుతాయన్నారు. ప్రధానంగా కార్మికుల వేతనం తగ్గడం, పారిశ్రామిక సంబంధాలకు విఘాతం కలగడం, సామాజిక భద్రత లేకపోవడం, వృత్తి పరమైన భద్రత, ఆరోగ్య పరిస్థితులు కార్మికులను తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉండేదని,  ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా యాజమాన్యం ఇష్టారాజ్యంగా తొలగించే అవకాశం ఉందన్నారు. ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యతిరేకి ంచాలని డిమాండ్‌ చేశారు. ఈ నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఏఐటీయూసీ కడప నగర నేతలు తారక రామారావు, మురారి, పుల్లయ్య, మేరి, కామాక్షమ్మ, శాంతికుమార్‌, ఇజ్రాయిల్‌ భాస్కర్‌,  కోటయ్య, మధుబాబు, శివ, వెంకటయ్య, నాగేంద్ర, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-02T05:22:37+05:30 IST