మృతి చెందిన మేకల వద్ద బాధితుడు
బోథ్‌రూరల్, మార్చి4: మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన బీరం నరేష్ అనే వ్యక్తికి చెందిన మేకల మందపై గురువారం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మేకలు మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ. 70వేల వరకు ఉంటుందని బాధితుడు నరేష్ కన్నీరు పెట్టుకున్నారు. తమను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.