ఆయనకు 75 ఏళ్లు.. ఆమెకు 70 ఏళ్లు.. 45 ఏళ్లుగా సంతానం కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మొత్తానికి అమ్మానాన్నలయ్యారు..!

ABN , First Publish Date - 2021-10-22T07:03:33+05:30 IST

వింత అనుకోండి.. విచిత్రం అనుకోండి.. కానీ ఇది నిజం. ఎన్నోఏళ్లుగా తల్లికావాలని కలలు కంటున్న ఓ 70 ఏళ్ల బామ్మ.. ..

ఆయనకు 75 ఏళ్లు.. ఆమెకు 70 ఏళ్లు.. 45 ఏళ్లుగా సంతానం కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మొత్తానికి అమ్మానాన్నలయ్యారు..!

వింత అనుకోండి.. విచిత్రం అనుకోండి.. కానీ ఇది నిజం. ఎన్నోఏళ్లుగా తల్లికావాలని కలలు కంటున్న ఓ 70 ఏళ్ల బామ్మ.. ఎట్టకేలకు తన ఆశ నెరవేర్చుకున్నారు. ఈ వయసులో తన తొలి బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు ఆనందాన్ని చవి చూశారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జివున్‌బెన్ రబారి అనే మహిళ, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తన 75 ఏళ్ల భర్త ద్వారానే తల్లి అయ్యారు. తన వయసును అధికారికంగా చెప్పడానికి తన వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని, కానీ.. తనకు ఇప్పుడు 70 ఏళ్లని ఆమె చెబుతారు.


45 ఏళ్లు దాటాయంటే స్త్రీ తల్లి కావడం అసాధ్యమని వైద్యులు చెబుతారు. అప్పుడు వారికున్న ఏకైక మార్గం.. ఐవీఎఫ్(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్)  విధానం. అందుకే ఈ విధానాన్నే వీరు అమలు చేశారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్ నరేశ్ భన్సాలీ ఏం చెబుతారంటే.. ‘రబరీ, తన భర్త తొలి సారి నా దగ్గరకు వచ్చినప్పుడు అసాధ్యమని చెప్పి పంపేశాను. కానీ వాళ్లు పట్టు వదల్లేదు. దీంతో అసాధ్యమనిపించినా.. ఆమె బిడ్డ కనేందుకు ఒప్పుకున్నాము. ముందుగా ఆమె రుతుక్రమం తిరిగి వచ్చేందుకు మెడిసిన్ ఇచ్చాం. ఆ తర్వాత వయసు వల్ల మూసుకుపోయిన ఆమె గర్భసంచిని తెరిచి అందులో ఫలదీకరణం చెందిన అండాలను ప్రవేశపట్టాం. 8 నెలల తర్వాత ఆపరేషన్ ద్వారా రబారీ పండండి బిడ్డకు జన్మనిచ్చారు. 45 ఏళ్ల వైవాహిక బంధం తరువాత మొట్టమొదటి సారి తల్లిదండ్రులైన ఆనందాన్ని ఇద్దరూ పొందారు.

Updated Date - 2021-10-22T07:03:33+05:30 IST