దేశంలో కొత్త‌గా 65,002 క‌రోనా కేసులు న‌మోదు

ABN , First Publish Date - 2020-08-15T16:28:44+05:30 IST

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన‌ తాజా గణాంకాల ప్రకారం దేశంలో గ‌డ‌చిన 24 గంటల్లో కొత్తగా 65,002 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య...

దేశంలో కొత్త‌గా 65,002 క‌రోనా కేసులు న‌మోదు

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన‌ తాజా గణాంకాల ప్రకారం దేశంలో గ‌డ‌చిన 24 గంటల్లో కొత్తగా 65,002 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,26,193కు చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 18,08,937 మంది రోగులు కోలుకున్నారు. 6,68,220 యాక్ట‌వ్ కేసులు ఉన్నాయి. గడ‌చిన‌ 24 గంటల్లో క‌రోనా కారణంగా 996 మంది మరణించగా, ఇప్పటివరకు మొత్తంగా 49,036 మంది బాధితులు మృతి చెందారు. దేశంలో కరోనా వ్యాప్తి వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్‌తో స‌మానంగా ఉంది. మ‌రోవైపు దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న‌వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. జూలై మొదటి వారంలో రోజుకు 15 వేల మంది మాత్రమే కోలుకోగా, ఆగస్టు మొదటి వారంలో ఈ సంఖ్య 50 వేలు దాటింది. దేశంలో మొత్తం కోలుకున్న బాధితుల సంఖ్య 16 ల‌క్ష‌లు దాటింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 643,948. ఇది మొత్తం కేసులలో 27 శాతంగా ఉంది. 

Updated Date - 2020-08-15T16:28:44+05:30 IST