కొడుకు, కోడలిని చంపి మేడ మీదకెళ్లి నిద్రపోయి తెల్లారే 65 ఏళ్ల వృద్ధుడి హైడ్రామా.. నిజం ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2022-05-20T22:25:26+05:30 IST

అతడు వృద్ధుడు. ప్రస్తుతం అతడికి 65ఏళ్ల వయసు ఉంటుంది. ఈ వృద్ధుడికి 27ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ యువకుడికి సుమారు ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ వృద్ధుడు దారుణానికి పా

కొడుకు, కోడలిని చంపి మేడ మీదకెళ్లి నిద్రపోయి తెల్లారే 65 ఏళ్ల వృద్ధుడి హైడ్రామా.. నిజం ఎలా బయటపడిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడు వృద్ధుడు. ప్రస్తుతం అతడికి 65ఏళ్ల వయసు ఉంటుంది. ఈ వృద్ధుడికి 27ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ యువకుడికి సుమారు ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ వృద్ధుడు దారుణానికి పాల్పడ్డాడు. కొడుకు, కోడలు నిద్ర పోతున్న సమయంలో ఘోరానికి తెగించాడు. ఇద్దరినీ హత్య చేసి.. ఏమీ తెలియనట్లు మేడమీదకు వెళ్లి నిద్రపోయాడు. పోలీసులకు విషయం తెలియడంతో హైడ్రామా మొదలు పెట్టాడు. చివరికి చేసిన తప్పు ఒప్పుకున్నాడు. నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన దీప్ తివారీకి ప్రస్తుతం 65ఏళ్లు. స్థానికంగా ఓ టీ కొట్టును నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీప్ తివారీ కొడుకు శివ(27).. సుమారు ఐదు నెలల క్రితమే జూలీ(25) అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో దీప్ తివారీ దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో పడుకున్న కొడుకు, కోడలిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మేడ మీదకు వెళ్లి నిద్రపోయాడు. అయితే శివ, జూలీ విగత జీవులుగా పడి ఉండటంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దీప్ తివారీ.. డ్రామా మొదలు పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి హత్య చేసి ఉంటారని కట్టు కథ అల్లాడు. అయితే పోలీసులు తమ స్టైల్‌లో ఎంక్వైరీ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు. వారిద్దరినీ తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. 



ఏళ్లుగా కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తాను.. శివ పెళ్లిపై గంపెడాశలు పెట్టుకున్నానని వెల్లడించాడు. కొడుకు పెళ్లి ద్వారా వచ్చిన కట్నం డబ్బులతో ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని భావించినట్టు తెలిపాడు. అయితే శివ ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తన ఆశలు అడియాసలు అయినట్టు చెప్పాడు. కోడలు ఇంట్లో అడుగు పెట్టిననాటి నుంచి సమస్యలు మరింత ఎక్కువైనట్టు వాపోయాడు. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం జూలీ అబార్షన్ చేయించుకుందని.. అందుకు రూ.15వేలు ఖర్చైనట్టు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. నెలనెలా డబ్బులు కట్టకపోవడంతో తన స్థలంలోంచి టీషాపును తీసేయాలని ఓనర్ ఒత్తిడి చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కోడకు, కోడలును హత్య చేసి, అనంతరం తాను కూడా హత్య చేయాలని భావించినట్టు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అతడిని అరెస్టు చేశారు. 


Updated Date - 2022-05-20T22:25:26+05:30 IST