Advertisement
Advertisement
Abn logo
Advertisement

624 రోజుల తర్వాత వరాహస్వామి దర్శనం

తిరుమల, ఆంధ్రజ్యోతి: దాదాపు 624 రోజుల తర్వాత తిరుమల వరాహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా కారణంగా గతేడాది మార్చి 20నుంచి శ్రీవారి దర్శనంతో పాటు పుష్కరిణి వద్దనున్న వరాహస్వామి దర్శనాన్ని కూడా రద్దు చేశారు. తరువాత విమాన గోపురానికి బంగారు పూత పూసి రాగి రేకులు అమర్చేందుకు గతేడాది డిసెంబరులో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించిన టీటీడీ అప్పట్లోనే ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి  నిత్య కైంకర్యాలు నిర్వహించింది.ఇటీవల విమాన గోపుర పనులు పూర్తి కావడంతో గత నెలాఖరులో జీర్ణోర్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. 

Advertisement
Advertisement