‘ఎలమంచిలి’ బరిలో 62 మంది

ABN , First Publish Date - 2021-03-04T06:48:41+05:30 IST

స్థానిక మునిసిపాలిటీలో 25 వార్డులుండగా మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

‘ఎలమంచిలి’ బరిలో 62 మంది
ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంటున్న పిళ్లా రమాకుమారి (5వ వార్డు)

వైసీపీ 22 వార్డుల్లో, టీడీపీ 20 వార్డుల్లో పోటీ

జనసేన 10, స్వతంత్రులు 8, బీజేపీ రెండు స్థానాలు

వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం


ఎలమంచిలి, మార్చి 3: స్థానిక మునిసిపాలిటీలో 25 వార్డులుండగా మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 22 వార్డుల్లో 62 మంది బరిలో నిలిచారు. మొత్తం 138 నామినేషన్లు దాఖలు కాగా, ఆరింటిని అధికారులు పరిశీలనలో తిరస్కరించారు. మిగిలిన 132 నామినేషన్లలో మంగళ, బుధవారాల్లో 70 మంది ఉపసంహరించుకున్నారు. వైసీపీ 22 వార్డుల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ 20 వార్డుల్లో, జనసేన 10, స్వతంత్రులు 8, బీజేపీ రెండు స్థానాల్లో బరిలో ఉన్నాయి. 12 వార్డుల్లో (1, 4, 6, 7, 9, 10, 12, 13, 17, 18, 22, 23,) ముఖాముఖి పోటీ నెలకొంది. ఆరు వార్డుల్లో (2, 11, 14, 20, 21, 25) త్రిముఖ, మూడు వార్డుల్లో (3, 19, 24) చతుర్ముఖ, ఒక వార్డు (8)లో పంచముఖ పోటీ నెలకొంది. ఐదో వార్డులో పిళ్లా రమాకుమారి, 15వ వార్డులో ఈరెగెల గణేశ్‌, 16వ వార్డులో మైచర్ల రాజావెంకటనాగేశ్వరరావు వైసీపీ తరపున ఏకగ్రీవమయ్యారు.

Updated Date - 2021-03-04T06:48:41+05:30 IST