బెంగాల్‌లో 6వ విడత పోలింగ్: సాయంత్రం 5 వరకు 80% ఓటింగ్

ABN , First Publish Date - 2021-04-22T23:26:58+05:30 IST

ఆరవ విడత పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకే 80 శాతం పోలింగ్ నమోదు అవడంతో అతి ఎక్కువ ఓటింగ్ నమోదు చేసుకున్న నాల్గవ విడత పోలింగ్‌ను అధిగమించనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

బెంగాల్‌లో 6వ విడత పోలింగ్: సాయంత్రం 5 వరకు 80% ఓటింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆరవ విడత పోలింగ్ గురువారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభైమన పోలింగ్‌లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓట్‌ను వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకే 80 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా నమోదు అవుతోంది. ఇప్పటికే ముగిసిన ఐదు విడతల పోలింగ్‌లో సగటున 80 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. అతి ఎక్కువగా రెండవ విడత పోలింగ్‌లో 86.11 శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా నాల్గవ విడత పోలింగ్‌లో 79.90 శాతం ఓటింగ్ నమోదైంది.


కాగా, ఆరవ విడత పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకే 80 శాతం పోలింగ్ నమోదు అవడంతో అతి ఎక్కువ ఓటింగ్ నమోదు చేసుకున్న నాల్గవ విడత పోలింగ్‌ను అధిగమించనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విడతలో మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్‌లో 13,87,791 మంది బెంగాలీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీని కోసం 14,480 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ విడతలో 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముకుల్ రాయ్, రాష్ట్ర మంత్రులు మంత్రి జ్యోతిప్రియో మల్లిక్, చంద్రిమా భట్టాచార్య, సీపీఎం నేత తన్మయ్ భట్టాచార్యలు ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న ఆరవ విడత ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Updated Date - 2021-04-22T23:26:58+05:30 IST