Advertisement
Advertisement
Abn logo
Advertisement

6 Kilometres.. 60 వేల బూట్ల వరుస..!

  • గిన్నీస్‌ రికార్డు సాధించిన ‘రియల్‌ పేజ్‌ ఇండియా’


హైదరాబాద్ సిటీ : వరుస క్రమంలో 60 వేలకు పైగా అమర్చిన బూట్లు (షూస్‌) ఇవి. 30,107 జతల ఈ బూట్లను సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు వరుసగా అమర్చారు. ఇది గిన్నీస్‌ రికార్డును సాధించింది. ఆదివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ శివారు గచ్చిబౌలి స్టేడియంలో రియల్‌ పేజ్‌ ఇండియా సంస్థ తమ నూతన సోషల్‌ ఇంపాక్ట్‌ కార్యక్రమం ‘రియల్‌ సోల్స్‌ ఫ్రమ్‌ రియల్‌ సౌల్స్‌’ పేరిట దీనిని ఏర్పాటు చేసింది. ఈ బూట్లను రాష్ట్రంలోని 100 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, రియల్‌ పేజ్‌ ఇండియా ఎస్‌వీపీ - మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement