ఐసొలేషన్ వార్డులుగా 5,601 రైల్వే కోచ్‌లు

ABN , First Publish Date - 2020-09-19T00:37:13+05:30 IST

కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 5,601 కోచ్‌లను..

ఐసొలేషన్ వార్డులుగా 5,601 రైల్వే కోచ్‌లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 5,601 కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్లు (ఐసొలేషన్ వార్డులు)గా మార్చినట్టు కేంద్ర రైల్వే శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.


సెంట్రల్ రైల్వే 482 కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చగా, ఈస్ట్రన్ రైల్వే 381, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 269, ఈస్ట్ కోస్ట్ రైల్వే 262, నార్త్‌రన్ రైల్వే 897, నార్త్ సెంట్రల్ రైల్వే 141, నార్త్ ఈస్ట్రన్ రైల్వే 217, నార్త్‌ఈస్త్ ఫ్రాంటియర్ రైల్వే 315, నార్త్ వెస్ట్రన్ రైల్వే 266, సదరన్ రైల్వే 573, సౌత్ సెంట్రల్ రైల్వే 486, సౌత్ ఈస్ట్రన్ రైల్వే 338, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 111, సౌత్ వెస్ట్రన్ రైల్వే 320, వెస్ట్రన్ రైల్వే 410, వెస్ట్ సెంట్రల్ రైల్వే 133తో కలిపి మొత్తం 5,601 కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చినట్టు రైల్వే శాఖ ఆ ప్రకటనలో వివరించింది.

Updated Date - 2020-09-19T00:37:13+05:30 IST