కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 53మంది డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-07-12T11:09:49+05:30 IST

తిరుపతిలోని కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్‌ నుంచి శనివారం 53 మందిని డిశ్చార్జి చేశారు.

కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 53మంది డిశ్చార్జి

తిరుపతి (వైద్యం)/తిరుచానూరు, జూలై 11: తిరుపతిలోని కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్‌ నుంచి శనివారం 53 మందిని డిశ్చార్జి చేశారు. రుయా ఐడీహెచ్‌ కొవిడ్‌ వార్డులో ఒకరు, ప్రసూతి కొవిడ్‌ వార్డులో ఒకరు, రుయా కొవిడ్‌ వార్డులో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు.ప్రభుత్వ సాయంగా ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున  నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు అందజేశారు.


స్విమ్స్‌ శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ఆస్పత్రి నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 219మంది అడ్మిట్‌లో ఉన్నారని మెడికల్‌ సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. తిరుచానూరు సమీపంలోని జిల్లా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 38 మంది బాధితులు శనివారం డిశ్చార్జి అయ్యారు.తుడా కార్యదర్శి లక్ష్మి, డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీఈ రవీంద్ర రూ.2 వేల చొప్పున ప్రభుత్వ సాయం అందజేశారు. 

Updated Date - 2020-07-12T11:09:49+05:30 IST