Advertisement
Advertisement
Abn logo
Advertisement

50ఏళ్ల క్రితం మిస్సైన ఉంగరం.. తిరిగి ఆమె చెంతకు..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళకు ప్రస్తుతం 86ఏళ్లు. ఆమె 50 ఏళ్ల క్రితం తన ఉంగరాన్ని పోగొట్టుకుంది. అయితే తాజాగా ఆ ఉంగరం తిరిగి ఆమె వద్దకు చేరింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా... ఇది నిజం. కాగా.. ఆమె ఎవరు.. ఎలా ఉంగరాన్ని తిరిగి పొందింది అనే వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌ సమీపంలోని ఔటర్ హెబ్రైడ్స్ దీవి వెస్ట్రన్ ఐల్స్ ప్రాంతానికి చెందిన పెగ్గీ మాక్‌స్వీన్‌కు ప్రస్తుతం 86ఏళ్లు. సుమారు 50ఏళ్ల క్రితం ఆమె తన ఇంటి ఆవరణలో బంగాళదుంపలు సేకరిస్తుండగా.. వేలి నుంచి పెళ్లినాటి ఉంగరం జారిపోయింది. దీంతో అప్పట్లో ఆ ఉంగరం కోసం చాలా వెతికింది. అయితే ప్రయోజనం లేకపోవడంతో.. వెతికే ప్రయత్నాలు ఆపేసింది. ఆ తర్వాత ఉంగరం విషయాన్నే ఆమె మర్చిపోయింది. అయితే.. ఇన్నాళ్లకు స్థానికంగా ఉండే.. డొనాల్డ్ మాక్‌ఫీ అనే వ్యక్తికి ఈ విషయం తెలిసింది. దీంతో మెటల్ డిటెక్టర్‌తో సహా రంగంలోకి దిగి, మూడు రోజుపాటు శ్రమించి ఆ ఉంగరాన్ని సంపాదించాడు. ఈ క్రమంలో 50ఏళ్ల తర్వాత ఆ ఉంగరం పెగ్గీ మాక్‌స్వీన్ చెంతకు చేరింది. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement