47కు పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-04-10T11:22:45+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యఅంతకంత కు పెరుగుతోంది. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో సగం మందికి పాజిటివ్‌ రాగా..

47కు పాజిటివ్‌ కేసులు

జిల్లాలో కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు

పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీకి  తరలింపు

జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తున్న యంత్రాంగం

మరో 15 రోజులు బయటకు రావద్దన్న కలెక్టర్‌


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆoధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంత కు పెరుగుతోంది. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో సగం మందికి పాజిటివ్‌ రాగా.. ప్రస్తుతం వారిని కలిసిన వారిలో వైరస్‌ లక్షణాలు బయటపడుతున్నా యి. కొత్తగా మరో 8 కేసులు నమోదయ్యాయి. తీవ్రత పెరుగుతుండడంతో అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూస్తు న్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి  తరలిస్తున్నారు. జిల్లాలోని ఐసోలేషన్‌, క్వారంటైన్‌లలో ఉన్న వారిని పరీక్షిస్తున్నా రు. పాజిటివ్‌ కేసులు వచ్చిన చోట కంటైన్‌మెంట్‌ క్లస్ట ర్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్‌కి వెళ్లివచ్చిన వారికి పరీక్షలు పూర్త య్యాయి. నవీపేట క్వారంటైన్‌లో ఉన్న వారిలో ఆరు కేసులు బయటపడగా మరో రెండు ఇతర ప్రాంతాల్లో నమోదయ్యాయి. మొత్తంగా 8 కేసులు బుధవారం అర్ధరాత్రి బయటపడడంతో పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


మిగతా వారిని క్వార ంటైన్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచారు. సెకండరి కాంటాక్ట్‌ అయిన వారందరినీ హోంక్వారంటైన్‌లో ఉంచి అబ్జర్వే షన్‌లో పెడుతున్నారు. జిల్లాలో గడిచిన పది రోజుల్లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 47కి చేరింది. వీరిలో మర్కజ్‌కు వెళ్లివచ్చినవారే 29 మంది వరకు ఉన్నారు. మిగతా పాజిటివ్‌ వ్యక్తులు వీరు కలిసిన వారే ఉన్నారు. కేసుల తీవ్రత పెరగడంతో జిల్లా యం త్రాంగం క్వారంటైన్ల నుంచి ఎవరూ బయటకు రాకుం డా చూస్తున్నారు. 14 రోజులు పూర్తై నెగెటివ్‌ వచ్చిన వారిని ఇళ్లకు పంపించడంతో పాటు ఆరు హోంక్వారం టైన్‌లో మళ్లీ కొనసాగాలని కోరుతున్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు పెట్టడంతో పాటు మళ్లీ క్వారం టైన్‌కు తరలిస్తామని అధికారులు వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


జిల్లాలో ఏర్పాటు చేసిన 15 కంటైన్‌ మెంట్‌ క్లస్టర్లలో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. జన సంచారం లేకుండా చూస్తున్నారు. ఇళ్ల నుంచి బయట కు రావద్దని కోరుతూనే అవసరమైన వారు టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరుతున్నారు. బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు అవసరమైన వారికి పోలీసు వాహనాల ద్వారా పంపిస్తున్నారు. నిత్యావసర సరుకులను మొబైల్‌ వ్యా న్‌ల ద్వారా అందిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నిత్యం స్ర్పే చేస్తున్నారు. కావలసిన మందుల ను సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీతిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నగరం పరిధిలో ఎక్కు వ మంది వాహనాల ద్వారా బయటకు వస్తుండడంతో పోలీసులు కట్టడి చేస్తున్నారు.


ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. తిప్పి పంపించారు. అవసరం లేకుండా వచ్చిన వాహనాలను సీజ్‌ చేశా రు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాంతంలో అధికారులంతా నిఘా పెట్టి పర్యటించడంతో పాటు కట్టడి చేసే ప్రయత్నాలను చేస్తున్నారు. లా క్‌డౌన్‌ సందర్భంగా ఎవరూ బయటకు రావద్దని కోరుతున్నారు. కే సుల సంఖ్య పెరుగుతున్నందున మరింత కట్టడి చేసేందుకు అధికా ర యంత్రాంగం సిద్ధమవుతోంది. కేసుల తీవ్రత పెరుగుతుండడం తో నగరంతో పాటు ఇతర ప్రాంతాలవాసుల్లో ఆందోళన మొదలవు తోంది. కొత్తగా నవీపేటలో కేసులు నిర్ధారణ కావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరిన్ని శాంపిళ్ల నివేదికలు వచ్చే అవ కాశం ఉండడంతో ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు. 


ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి : కలెక్టర్‌

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని, వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆడియోను వి డుదల చేశారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో పాటు వారి ప్రైమరి కాం టాక్ట్స్‌కు పాజిటివ్‌ వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు ఓర్పుతో లాక్‌డౌన్‌ను కొనసాగించారని, అదే స్ఫూర్తితో మరో 15 రోజుల పా టు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వా రిని వెంటనే గాంధీకి తరలిస్తున్నామని తెలిపారు. మిగతా వారిని క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి వైద్యసహాయం అందిస్తున్నా మన్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారెవరూ బయటకు రావద్దని కోరారు.  ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని, యువ కులను బయటకు పంపవద్దన్నారు. 

Updated Date - 2020-04-10T11:22:45+05:30 IST