లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 43,339మందిపై కేసులు

ABN , First Publish Date - 2020-04-10T10:53:24+05:30 IST

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 43,339మందిపై కేసులు నమో దు చేసినట్లు రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు తెలిపారు.v

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 43,339మందిపై కేసులు

ట్రాఫిక్‌ డీసీసీ దివ్యచరణ్‌

గరిడేపల్లిలో 70వాహనాలు సీజ్‌


చౌటుప్పల్‌ రూరల్‌ / గరిడేపల్లి, ఏప్రిల్‌9 : రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 43,339మందిపై కేసులు నమో దు చేసినట్లు రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు తెలిపారు. గురువారం ఆయన చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టును పరిశీలించి ట్రాఫిక్‌ పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గత నెల 22నుంచి ఈ నెల 8వరకు లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఈ చలాన్‌ కేసులు 38,029, వాహనాలు నిలిపగా విధించిన కేసులు 5,310, సీజ్‌ చేసిన వాహనాలు 2,439 ఉన్నాయని తెలిపారు.


ప్రజలు అకారణంగా రోడ్డు మీద సంచరించకుండా కమిషనర్‌ పరిధిలో 33చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా నివారణ అరికట్టడానికి మైక్‌ స్పీకర్లతో 10బైకులతో ప్రచారం చే స్తామని తెలిపారు. కరోనా నివారణకు అత్యవసర సేవలు అందించడానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్‌ రూం ఫోన్‌నెంబరు 9490617234ను సంప్రదించాలని కోరారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.


కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ ముని పాల్గొన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ పాటించకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారుల 70మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ నర్సింగ్‌ వెంకన్నగౌడ్‌ గురువారం  తెలిపారు. ఎవరైనా ఏ కారణం లేకుండా పదేపదే రోడ్లపైకి వస్తే వారి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2020-04-10T10:53:24+05:30 IST